భూమి , విముక్తి కోసం ఐలమ్మ పోరాటం చిరస్మరణీయం: సిపిఐ

రైజింగ్ సన్ న్యూస్ వనపర్తి సెప్టెంబర్ 26: అట్టడుగు రజక సమాజంలో పుట్టి ప్రజల పక్షాన సంపన్నులపై ఐలమ్మ సాగించిన పోరాటం చరిత్రలో చిరస్మరణీయమని సిపిఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, ఎన్ఎఫ్ఐ డబ్ల్యూ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు కళావతమ్మలు పేర్కొన్నారు. శనివారం సిపిఐ కార్యాలయంలో వీరవనిత చాకలి అయిలమ్మ 131 వ జయంతి పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. నిజాం నవాబు, దొరలకు వ్యతిరేకంగా నడుము కట్టి భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ నుంచి విముక్తి కోసం తెలంగాణ ప్రజల పక్షాన పోరాడిందన్నారు. ఆమె పోరాటం బడుగు, బలహీన వర్గాల హక్కుల స్ఫూర్తిగా నిలిచిందన్నారు .కూతురిపై అత్యాచారం చేసిన, కొడుకును జైలుకు పంపిన కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టిన నిజాం దొరలపై పోరాటపటిమను వెరవని వీర వనిత ఐలమ్మ అన్నారు. మహిళలకు ఆమె పోరాటం స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఆమె చరిత్రను పాఠ్యపుస్తకాల్లో పెట్టాలన్నారు. ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు కళావతమ్మ, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, సిపిఐ నేతలు పృథ్వినాదం, లక్ష్మీనారాయణ, వంశీ, మహిళా నేతలు జయమ్మ, జ్యోతి, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.
0 Comments