ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్కు ఉచిత శిక్షణ
- జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఉమపతి
రైజింగ్ సన్ న్యూస్,నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో అక్టోబర్ 13: నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్న యువతీ, యువకులు పోలీస్ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మహబూబ్నగర్ జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్లో ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ అందించనున్నట్లు నాగర్కర్నూల్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కె. ఉమాపతి మంగళవారం పత్రికా ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన షెడ్యూల్డ్ కులాల అభ్యర్థులు ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా పరిధిలో పోలీస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అర్హులైన డిగ్రీ ఉత్తీర్ణుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు డిసెంబర్ 20వ తేదీ వరకు ఉచిత వసతితో కూడిన శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అర్హులైన అభ్యర్థులు 2026 అక్టోబర్ 14వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు మహబూబ్నగర్లోని జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్లో నేరుగా దరఖాస్తులు సమర్పించాలని ఉమాపతి సూచించారు. దరఖాస్తుతో పాటు అవసరమైన ధ్రువపత్రాలను జతచేసి ఆఫ్లైన్ విధానంలో అందజేయాలని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక డిగ్రీలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఉంటుందని స్పష్టం చేశారు. పోలీస్ ఉద్యోగాల సాధనకు సిద్ధమవుతున్న అర్హులైన అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని, శిక్షణకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం 8977340006, 8500334470, 8309657774 ఫోన్ నంబర్లను సంప్రదించాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కె. ఉమాపతి సూచించారు.

0 Comments