Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

కృష్ణా నదిపై ఐకానిక్‌ బ్రిడ్జి శంకుస్థాపనకు గడ్కరీకి ఆహ్వానం...- కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి మంత్రులు కోమటిరెడ్డి, జూపల్లి విన‌తి

 కృష్ణా నదిపై ఐకానిక్‌ బ్రిడ్జి శంకుస్థాపనకు గడ్కరీకి ఆహ్వానం...


- కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి మంత్రులు కోమటిరెడ్డి, జూపల్లి ఆహ్వానం

రైజింగ్ సన్ న్యూస్, (నాగర్ కర్నూల్ జిల్లా బ్యూరో) అక్టోబర్ 13: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య రవాణా అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు, కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో పర్యాటకాభివృద్ధికి ఊతమిచ్చేలా కృష్ణా నదిపై నిర్మించనున్న ఐకానిక్‌ బ్రిడ్జి  శంకుస్థాపన  కార్య‌క్ర‌మానికి రావాల‌ని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఆహ్వానించారు. రాష్ట్రానికి అవసరమైన కీలక రహదారులు, వంతెనలు, ఎలివేటెడ్ కారిడార్లు, రోప్‌వేలు సహా పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై  మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,  జూప‌ల్లి కృష్ణారావు మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో  భేటీ అయ్యారు. 

హైబ్రిడ్‌ బ్రిడ్జితో రెండు రాష్ట్రాల అనుసంధానం బలోపేతం

జాతీయ రహదారి 167కేపై కృష్ణా నదిపై నిర్మించనున్న హైబ్రిడ్‌ కేబుల్‌-స్టేయిడ్‌, సస్పెన్షన్‌ తరహా ఐకానిక్‌ వంతెనకు శంకుస్థాపన కార్యక్రమానికి రావాల‌ని కోరగా.. కేంద్ర మంత్రి గ‌డ్క‌రీ అంగీకారం తెలిపారు. ఈ వంతెన నిర్మాణంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య అంతర్రాష్ట్ర అనుసంధానం మెరుగుపడటంతోపాటు హైదరాబాద్‌ నుంచి తిరుపతికి మ‌ధ్య 80 కి.మీ ప్రయాణ దూరం తగ్గి, సుమారు 3 గంట‌ల  ప్ర‌యాణ స‌మ‌యం  త‌గ్గుతుంద‌ నివివరించారు. 

సోమశిల ఆధ్యాత్మిక‌, ప్రకృతి పర్యాటక శోభ‌

ఈ ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి, ఆర్థిక కార్యకలాపాల విస్తరణకు ఈ వంతెన నిర్మాణం దోహదపడుతుందని, స్థానికుల‌కు ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలు మెరుగుప‌డ‌తాయ‌ని పేర్కొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన సోమశిల.. ఆధ్యాత్మిక, ప‌ర్యాట‌క హ‌బ్ గా వృద్ధి చెంది, తెలంగాణలో ఒక మైలురాయిగా నిలవనుందని తెలిపారు. కృష్ణా నది, శ్రీశైలం జలాశయ బ్యాక్‌వాటర్స్‌, నల్లమల అటవీ ప్రాంతం మధ్య ఉన్న సోమశిల.. ప్రకృతి పర్యాటకానికి విశేష అవకాశాలున్న ప్రాంతం. ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణంతో ఈ ప్రాంతానికి రవాణా సౌకర్యాలు మెరుగుపడితే పర్యాటకుల రాక గణనీయంగా పెరుగుతుంద‌ని,  బోటింగ్‌, పర్యాటకాన్ని ప్రోత్సహించడంతోపాటు స్థానికంగా హోటళ్లు, రవాణా, ఆతిథ్య రంగాల్లో ఉపాధి అవకాశాలు విస్తరించనున్నాయని, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాన్ని సమగ్ర పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు మెరుగైన రహదారి అనుసంధానం కీలకం కానుందని మంత్రులు వివరించారు.

జాతీయ ర‌హ‌దారిగా మార్చండి

రాష్ట్రంలో సుమారు 225 కి.మీ. మేర ప్రతిపాదించిన రహదారి మార్గాన్ని జాతీయ రహదారిగా ప్రకటించి అభివృద్ధి చేయాలని మంత్రులు కోరారు. పుల్లూరు (ఎన్‌హెచ్‌-44) నుంచి ఆలంపూర్‌- జటప్రోలు- పెంట్లవెల్లి - కొల్లాపూర్‌- లింగాల- అచ్చంపేట- డిండి (ఎన్‌హెచ్‌-765) - దేవరకొండ (ఎన్‌హెచ్‌-167) - మల్లేపల్లి మీదుగా నల్గొండ (ఎన్‌హెచ్‌-565) వరకు రాష్ట్ర రహదారుల‌ను జాతీయ రహదారిగా అప్‌గ్రేడ్ చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేయ‌గా.. నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. ఈ రహదారి అభివృద్ధితో ఇప్పటికే ఉన్న జాతీయ రహదారులతో అనుసంధానం మెరుగుపడటంతోపాటు ప్రయాణ సమయం, రవాణా వ్యయాలు తగ్గుతాయని వారు వివరించారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, వాణిజ్య కార్యకలాపాలు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. విద్య, వైద్య సేవలను  సులభతరం కావడంతోపాటు పర్యాటక ప్రాంతాలకు రాకపోకలు పెరిగేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. 

శ్రీశైలం మార్గంలో ఎలివేటెడ్ కారిడార్‌కు కొత్త డీపీఆర్

హైదరాబాద్–శ్రీశైలం NH-765పై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి  చేసిన విజ్ఞప్తిపై నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొత్త DPR సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.  గ‌డ్క‌రీని క‌లిసిన‌ వారిలో ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య,  కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ అధికారులు, రాష్ట్ర అధికారులు ఉన్నారు.

💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి