జిల్లాల అభివృద్ధికి కేసీఆర్ కృషికి కృతజ్ఞతగా ‘రన్ ఫర్ తెలంగాణ’
రేపు వనపర్తిలో 2కే రన్.. పాల్గొనాలని బీఆర్ఎస్ నాయకుల పిలుపు
రైజింగ్ సన్ న్యూస్ వనపర్తి , అక్టోబరు 10: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ, కలెక్టరేట్ సముదాయాల నిర్మాణం, వైద్య, ఇంజినీరింగ్ కళాశాలల ఏర్పాటు తదితర అభివృద్ధి కార్యక్రమాలకు కృతజ్ఞతలు తెలుపుతూ వనపర్తిలో ఆదివారం ‘2కే రన్’ నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల ఆవిర్భావ దశాబ్ద ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వనపర్తి పట్టణ మాజీ అధ్యక్షుడు పలుస రమేష్ గౌడ్ , బీఆర్ఎస్ పార్టీ వనపర్తి పట్టణ మాజీ ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి , వనపర్తి పట్టణ యువజన అధ్యక్షుడు సూర్యవంశం గిరి , బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, వనపర్తి జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆధ్వర్యంలో అక్టోబరు 11న ఉదయం 6 గంటలకు వనపర్తి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుంచి నల్లచెరువు ట్యాంక్బండ్ వరకు రన్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వనపర్తి పట్టణంలోని 33 వార్డులకు చెందిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, యువజన విభాగం నాయకులు, పార్టీ శ్రేణులు, కౌన్సిలర్లు, తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థులు, మైనార్టీ యువత, నాయకులకు నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో జిల్లాల ఏర్పాటు, జిల్లా స్థాయి మౌలిక వసతుల అభివృద్ధికి చేసిన కృషిని గుర్తుచేసుకుంటూ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు.

0 Comments