జిల్లాలో మెరుగైన వైద్య సేవలే లక్ష్యం: డీఎంహెచ్వో డాక్టర్ భాస్కర్ నాయక్
రైజింగ్ సన్ న్యూస్ వనపర్తి,సెప్టెంబర్ 26:
జిల్లాలో అమలవుతున్న వివిధ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిపై జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి శ్రీ డాక్టర్ భాస్కర్ నాయక్ అధ్యక్షతన వైద్యాధికారులు, ఎంఎల్హెచ్పీలు, సూపర్వైజర్లతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోషణ మాసోత్సవాల నిర్వహణతో పాటు, ఐరన్ లోపం ఉన్న పిల్లలను గుర్తించడం మరియు మాతా శిశు ఆరోగ్య కార్యక్రమాల అమలుపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) స్క్రీనింగ్ ప్రక్రియను, అండర్ ట్రీట్మెంట్లో ఉన్న రోగుల పర్యవేక్షణ మరియు ఫాలోఅప్ కేసులను మరింత మెరుగుపరచాలని సూచించారు. అలాగే సోమవారం నాడు ‘నషా ముక్త్ యువ_వికసిత భారత్’ కార్యక్రమం కింద విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించాలని, అలాగే ‘ప్రపంచ రేబిస్ దినోత్సవ’ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో జ్వరంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని గుర్తించి, విధిగా రక్త పరీక్షలు నిర్వహించి తగిన వైద్యం అందించాలని స్పష్టం చేశారు. పరిసరాల పరిశుభ్రతలో భాగంగా ప్రతీ మంగళవారం, శుక్రవారాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఇళ్ల చుట్టూ నీరు నిల్వకుండా, దోమల లార్వా వృద్ధి చెందకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.జిల్లాలో అందిస్తున్న అన్ని ఆరోగ్య సేవల వివరాలను ఎప్పటికప్పుడు సకాలంలో ఆన్లైన్ పోర్టల్స్లో నమోదు చేసి అప్డేట్ చేయాలని డీఎంహెచ్వో స్పష్టం చేశారు.ఈ సమావేశంలో జిల్లా ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ మారుతీ నందన్, డాక్టర్ రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగిన సూచనలు జేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఎంఎల్హెచ్పీలు, సూపర్వైజర్లు, జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు మరియు డీడీఎంలు పాల్గొన్నారు.


0 Comments