Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

రూ.10 కోట్లతో బీసీ గురుకుల కళాశాల శాశ్వత భవనం...

రూ.10 కోట్లతో బీసీ గురుకుల కళాశాల శాశ్వత భవనం

- సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి , మంత్రి జూపల్లి ఎంపీ మల్లు రవి స్థానిక ఎమ్మెల్యే మెగా రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన

- ఏర్పాట్లను పరిశీలించిన డీసీవో శ్రీవేణి, ఇంజనీరింగ్ అధికారులు

 రైజింగ్ సన్ న్యూస్,(వనపర్తి ,సెప్టెంబరు 26): మండలంలోని చిట్యాల గ్రామ పరిధిలో గల బీసీ గురుకుల పాఠశాల ఆవరణలోబీసీ గురుకుల బాలుర జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు లు సోమవారం ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ మేరకు బీసీ గురుకులాల వనపర్తి జిల్లా సమన్వయ అధికారి (డీసీవో) శ్రీవేణి వివరాలు వెల్లడించారు.రెండేళ్ల క్రితం పంపిన ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రభుత్వం స్పందించి, కళాశాల శాశ్వత భవన నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు. చిట్యాల బీసీ గురుకుల పాఠశాల ప్రాంగణంలోని ఐదు ఎకరాల విస్తీర్ణంలో రెండు అంతస్తుల బ్లాకులుగా (అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, హాస్టల్ బ్లాక్) మొత్తం 40 గదులతో (హాల్స్) ఈ భవనాన్ని నిర్మించనున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జూపల్లి మంత్రుల పర్యటన, శంకుస్థాపన సభ ఏర్పాట్లను కళాశాల ప్రిన్సిపాల్ గురువయ్య గౌడ్, పాఠశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి డీసీవో శ్రీవేణి శనివారం పరిశీలించారు.  ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు సాయి రెడ్డి, చిట్యాల గ్రామ ప్రజాప్రతినిధులు రఘుపతిరావు, పాఠశాల, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి