Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

బీజేపీ కార్యాలయంపై దాడి.. రాజకీయ దుమారం - కాంగ్రెస్‌ తీరుపై కమలనాథుల ఆగ్రహం.. వనపర్తిలో నిరసన

 

బీజేపీ కార్యాలయంపై దాడి.. రాజకీయ దుమారం

 - కాంగ్రెస్‌ తీరుపై కమలనాథుల ఆగ్రహం.. వనపర్తిలో నిరసన

వనపర్తి, సెప్టెంబరు 01(రైజింగ్ సన్ న్యూస్ ): హైదరాబాద్‌లోని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడ్డారంటూ బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ విభేదాలను ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించుకోవాల్సిన చోట భౌతిక దాడులకు పాల్పడటం దురదృష్టకరమని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో చర్చలకు బదులు దాడుల రాజకీయాలకు దిగడం సరికాదన్నారు.

బీజేపీ నాయకుల ఆరోపణల ప్రకారం.. కాంగ్రెస్‌ కార్యకర్తలు బీజేపీ నాయకులు, కార్యాలయాలపై దాడులకు పాల్పడుతున్నప్పటికీ పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసు, నిఘా వ్యవస్థలు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీ కార్యాలయానికే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటని నిలదీశారు.

వనపర్తిలో బీజేపీ నిరసన

హైదరాబాద్‌లో జరిగిన ఘటనకు నిరసనగా వనపర్తి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్‌ దాడి రాజకీయాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.

అయితే నిరసన సందర్భంగా పోలీసులు బీజేపీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి వనపర్తి టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారని బీజేపీ నేతలు ఆరోపించారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును పోలీసులు అడ్డుకున్నారని విమర్శించారు.

దాడులకు స్వస్తి పలకాలి

రాజకీయ ప్రత్యర్థులపై భౌతిక దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. పార్టీ కార్యాలయాలు, నాయకులు, కార్యకర్తలకు తగిన భద్రత కల్పించాలని కోరారు. రాజకీయ విభేదాలను దాడులతో కాకుండా ప్రజాస్వామ్య పద్ధతుల్లో పరిష్కరించుకోవాలని సూచించారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులు పునరావృతమైతే చట్టపరంగా ఎదుర్కొంటామని బీజేపీ నాయకులు హెచ్చరించారు.

💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి