Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

సేవా మార్గమే స్ఫూర్తి.. చిరంజీవి అభిమానుల సందేశం - వనపర్తి జిల్లా కేంద్రంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

 సేవా మార్గమే స్ఫూర్తి.. చిరంజీవి అభిమానుల సందేశం

- వనపర్తి జిల్లా కేంద్రంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు 



వనపర్తి, ఆగష్టు 22(రైజింగ్ సన్ న్యూస్ ): మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని వనపర్తి జిల్లా కేంద్రంలో మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ముకుంద నాయుడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అభిమానులు ఉత్సాహంగా పాల్గొని చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ.. చిరంజీవి కేవలం సినీ నటుడిగానే కాకుండా సేవా కార్యక్రమాలతో సమాజానికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ వంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ రక్తదానం, నేత్రదానం వైపు యువతను నడిపించిన ఆయన సేవా స్ఫూర్తి ఆదర్శనీయమన్నారు.అభిమానులు తమ అభిమాన హీరో జన్మదిన వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా, సేవా కార్యక్రమాల ద్వారా సమాజానికి ఉపయోగపడేలా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. చిరంజీవి చూపిన సేవా మార్గాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది యువత రక్తదానం, నేత్రదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు రాములు, ఉత్తేజ్, నరసింహ, రవి తదితరులు పాల్గొన్నారు.

💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి