ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభల పోస్టర్ విడుదల
వనపర్తి, ఆగష్టు 21( రైజింగ్ సన్ న్యూస్): ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహాసభలు సెప్టెంబర్ 6, 7, 8 తేదీల్లో కరీంనగర్లో నిర్వహించనున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మోష తెలిపారు. మహాసభలకు సంబంధించిన పోస్టర్లను శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిలో కార్మికులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర మహాసభల్లో విస్తృతంగా చర్చించి, వాటి పరిష్కారానికి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యలపై అనుసరిస్తున్న విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి, భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.ప్రాధాన్యత కలిగిన ఈ మహాసభలను కార్మికులంతా ఐక్యంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి శ్రీరామ్, గోపాలకృష్ణ, జిల్లా నాయకులు రమేష్, హాస్పిటల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి శ్రీను, నాయకులు కృష్ణ, రాజేష్, నరేందర్, భాగ్యమ్మ, సుజాత, ఖదీర్, శ్రీకాంత్, అశోక్, రేణుక, సరోజ తదితరులు పాల్గొన్నారు.
0 Comments