భారతీయ జనతా పార్టీ వనపర్తి జిల్లా కార్మిక విభాగం కన్వీనర్గా బంకలి సుబ్రహ్మణ్యం నియామకం ....
రైజింగ్ సన్ న్యూస్, వనపర్తి సెప్టెంబర్ 27 :
భారతీయ జనతా పార్టీ (BJP) లేబర్ సెల్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కార్మిక విభాగం (కార్మిక సెల్) జిల్లా కన్వీనర్గా శ్రీ బంకలి సుబ్రహ్మణ్యం నియమితులైనట్లు హైదరాబాదులోని తన
కార్యాలయంలో రాష్ట్ర లేబర్ సెల్ కన్వీనర్ అందె శ్రీనివాస్ నియామక పత్రాన్ని జారీ చేశారు. వనపర్తి జిల్లా అధ్యక్షులు దుప్పలి నారాయణ సహకారంతో ఈ నియామకం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాల పట్ల, సమాజం పట్ల బంకలి సుబ్రహ్మణ్యం చూపుతున్న నిబద్ధత, క్రమశిక్షణ మరియు సమర్థవంతమైన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం పాటుపడుతూ, సంస్థ బలోపేతానికి ఆయన మరింత కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పదాధికారులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.


0 Comments