Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

వృద్ధులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాల్సిందే: సీపీఐ డిమాండ్

 వృద్ధులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాల్సిందే: సీపీఐ డిమాండ్

వనపర్తి, ఆగస్టు 15( రైజింగ్ సన్ న్యూస్):వ్యవసాయ, కూలి పనులు చేసుకోలేని భూమిలేని పేదలైన వృద్ధులకు కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీరామ్, వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు. శనివారం వనపర్తిలో విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వృద్ధాప్య పింఛన్లు నిరంతరం మంజూరయ్యాయని గుర్తుచేశారు.2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఇంట్లో వృద్ధ దంపతులు ఇద్దరికీ పింఛన్లు ఇస్తామని చెప్పి, ప్రస్తుతం ఒక్కరికే ఇస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ప్రభుత్వం కొత్తగా రెండు లక్షల మందికి పింఛన్లు ఇస్తామని ప్రకటించడంతో అర్హులైన వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు గ్రామ పంచాయతీల్లో దరఖాస్తులు సమర్పించారని తెలిపారు. అయితే, కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో వృద్ధాప్య పింఛన్ల (ఓఏపీ) ప్రస్తావన లేకపోవడంతో ఎంపీడీవో కార్యాలయాల్లో వాటిని పక్కన పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని వృద్ధులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. తక్షణమే స్పందించి వృద్ధాప్య పింఛన్లను కూడా మంజూరు చేయాలని, లేనియెడల దరఖాస్తు చేసుకున్న వృద్ధులతో కలిసి పెద్దఎత్తున ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు.

💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి