మాతాపిత్రుల స్మరణార్థం విద్యార్థులకు ఆర్థిక చేయూత.. పంచాయతీకి వాటర్ ప్యూరిఫైయర్ విరాళం
వనపర్తి, కడుకుంట్ల, ఆగస్టు 15: ( రైజింగ్ సన్ న్యూస్): వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామానికి చెందిన ముసలి బాలరాజు.. తన తల్లిదండ్రులు కీర్తిశేషులు ముసలి కొండన్న, ముసిలి శంకరమ్మ జ్ఞాపకార్థం గ్రామ అభివృద్ధికి, విద్యార్థుల ప్రోత్సాహానికి ఉదారత చాటుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఆయన నగదు పురస్కారాలు అందజేశారు.మొదటి ర్యాంకు సాధించిన ఐదుగురు విద్యార్థులకు రూ. 2,000 చొప్పున, మిగతా 21 మంది విద్యార్థులకు రూ. 1,500 చొప్పున మొత్తం రూ. 41,500 నగదును అందజేసి విద్యార్థులను అభినందించారు. అలాగే గ్రామ ప్రజలకు శుద్ధ జలం అందించే ఉద్దేశంతో గ్రామ పంచాయతీ కార్యాలయానికి రూ. 12,500 విలువ చేసే వాటర్ ప్యూరిఫైయర్ను విరాళంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జి. తిరుపతయ్య, ఉపసర్పంచ్ భారత్ సాగర్, మాజీ సర్పంచులు వడ్ల సుధాకర్, వారాల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సమాజానికి ఎంతో ఆదర్శంగా నిలిచేలా దాతృత్వం చాటుకున్న ముసలి బాలరాజు దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు గ్రామ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
0 Comments