Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

వనపర్తిలో పచ్చదనంపై జేసీబీ ప్రతాపం.. రహదారి పక్కన ఏపుగా పెరిగిన చెట్ల నరికివేత!



 వనపర్తిలో పచ్చదనంపై జేసీబీ ప్రతాపం.. రహదారి పక్కన ఏపుగా పెరిగిన చెట్ల నరికివేత!
  

వనపర్తి, ఆగస్టు17 (రైజింగ్ సన్ న్యూస్): వనపర్తి మండలంలోని వనపర్తి నుండి కాశీం నగర్ వరకు వెళ్లే ప్రధాన రహదారి ఇరుప్రక్కల గతంలో ఎంతో శ్రమకోర్చి నాటిన మొక్కలు, నేడు ఏపుగా పెరిగి మహావృక్షాలుగా మారిన చెట్లను అధికార పార్టీ నాయకులు జేసీబీలతో నేలమట్టం చేయడం పట్ల స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పర్యావరణ పరిరక్షణను కాపాడాల్సిన వారే ఇలా వృక్షాలను అడ్డగోలుగా నరికివేయడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ అక్రమ నరికివేతను ఆయా గ్రామాల గిరిజన తండాల ప్రజలు, యువకులు ప్రశ్నించగా, వారిని బెదిరింపులకు గురిచేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు ప్రభుత్వం పచ్చదనాన్ని పెంపొందించడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటే, మరోవైపు ఇలాంటి చర్యలకు పాల్పడటం చట్టాన్ని ఉల్లంఘించడమేనని స్థానికులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందించి, పచ్చదనాన్ని ధ్వంసం చేసి చెట్లను అక్రమంగా నరికివేసిన వారిపై తక్షణమే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు, యువకులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.

💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి