Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

చిన్నారెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఫిర్యాదు

 టీపీసీసీ అధ్యక్షుడికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఫిర్యాదు: చిన్నారెడ్డి వ్యాఖ్యలపై దుమారం

  • కన్నతల్లి లాంటి కాంగ్రెస్‌పై అనుచిత వ్యాఖ్యలు తగవు

  • గాంధీభవన్‌లో మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసిన వనపర్తి ఎమ్మెల్యే మరియు శ్రేణులు

వనపర్తి, ఆగష్టు 18 ( రైజింగ్ సన్ న్యూస్): కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో TPCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, నియోజకవర్గంలోని వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, మార్కెట్ యార్డు చైర్మన్లు, సర్పంచులు, కౌన్సిలర్లు, పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, శ్రేణులు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తమకు కేవలం ఒక రాజకీయ వేదిక కాదని, కన్నతల్లి లాంటిదన్నారు. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, పార్టీ డబ్బులకు అమ్ముడుపోయిందంటూ నిరాధార ఆరోపణలు చేయడం పార్టీ క్రమశిక్షణకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా కష్టపడి పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తల మనోభావాలను ఇలాంటి వ్యాఖ్యలు తీవ్రంగా గాయపరుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని బలోపేతం చేయాల్సిన తరుణంలో ఇలా విభేదాలు సృష్టించే వారిపై అధిష్టానం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అధిష్టానం సానుకూల స్పందన

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నేతృత్వంలో వచ్చిన వనపర్తి జిల్లా కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదుపై TPCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సానుకూలంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలపై తగిన విచారణ చేపట్టి, పార్టీ పెద్దలతో చర్చించిన అనంతరం అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. పార్టీలో ఎవరికీ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే హక్కు లేదని, నాయకత్వాన్ని కించపరిచేలా మాట్లాడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణను కాపాడుతూ అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి