Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

నేతాజీ ఆశయాలు స్ఫూర్తిదాయకం: నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి వేడుకలు- బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో

నేతాజీ ఆశయాలు స్ఫూర్తిదాయకం: నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి వేడుకలు


వనపర్తి, ఆగష్టు 18 ( రైజింగ్ సన్ న్యూస్): బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు అధ్యక్షతన స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఆర్.లోకనాథ్ రెడ్డి నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆజాద్ హింద్ ఫౌజ్‌ను ఏర్పాటు చేసి, 'మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి - నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను' అనే నినాదంతో జాతిని ఏకం చేసిన గొప్ప యోధుడు నేతాజీ అని కొనియాడారు. మహాత్మా గాంధీ నేతృత్వంలోని అహింసాయుత పోరాటాలతో పాటు, నేతాజీ సైనిక పోరాటాలు దేశ స్వాతంత్ర్యానికి బలమైన బాటలు వేశాయని పేర్కొన్నారు. నేతాజీ మరణం వెనక ఉన్న రహస్యాలను బయటపెట్టడంలో గత పాలకుల వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వమే ఆ మహనీయుని చరిత్రకు సంబంధించిన పత్రాలను పబ్లిక్ డొమైన్‌లోకి తీసుకువచ్చి తగిన గౌరవం కల్పించిందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్. వెంకటేశ్వర్ రెడ్డి, పీ. శ్రీనివాస్ గౌడ్, భాశెట్టి శ్రీనివాసులు, కృష్ణ గౌడ్, నక్క మహేష్, కొమ్ము శ్రీనివాసులు, విజయ్ సాగర్, ఎండి ఖలీల్, ద్వారపోగు నారాయణ, రాయన్న సాగర్ తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి