Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ భాస్కర్ నాయక్ బాధ్యతల స్వీకరణ - పలువురి ఘన సన్మానం

వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ భాస్కర్ నాయక్ బాధ్యతల స్వీకరణ - పలువురి ఘన సన్మానం

బీసీ పొలిటికల్ జేఏసీ విజ్ఞప్తి: జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

వనపర్తి, ఆగష్టు 19 ( రైజింగ్ సన్ న్యూస్): వనపర్తి జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నూతనంగా నియమితులైన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DMHO) డాక్టర్ బి. భాస్కర్ నాయక్‌ను బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీసీ పొలిటికల్ జేఏసీ వనపర్తి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేందర్ నాయుడు మాట్లాడుతూ.. అన్ని వృత్తులకంటే వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనదని, వైద్యులు భగవత్ స్వరూపులతో సమానమని కొనియాడారు. జిల్లా అధికారిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ భాస్కర్ నాయక్.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రత్యేక కృషి చేయాలని కోరారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHC) వైద్యాధికారులు మరియు సిబ్బందిని సమన్వయం చేస్తూ, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మంచి చేసే ప్రతి అధికారికి బీసీ పొలిటికల్ జేఏసీ ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వి.వి. గౌడ్, పట్టణ అధ్యక్షుడు దేవర శివ, శ్రీరంగాపూర్ మండల అధ్యక్షుడు ధర్మేంద్ర సాగర్, ప్రధాన కార్యదర్శి ఆస్కని రమేష్, నిప్పు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

హెల్త్ అసిస్టెంట్స్ ఆధ్వర్యంలో డీఎంహెచ్‌ఓ కు సన్మానం

వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ బి. భాస్కర్ నాయక్‌ను జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (PHC) పనిచేస్తున్న హెల్త్ అసిస్టెంట్లు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ భాస్కర్ నాయక్ మాట్లాడుతూ.. వైద్య సిబ్బంది అందరూ అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా హెల్త్ అసిస్టెంట్లు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.




💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి