పాము కాటు ఘటనలపై వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
కొత్తకోట/వనపర్తిఆగష్టు 19 ( రైజింగ్ సన్ న్యూస్): జిల్లాలో పాము కాటు కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా వైద్య సిబ్బంది పూర్తి అప్రమత్తతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కొత్తకోట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని మందుల నిల్వలు, గర్భిణులకు అందుతున్న సేవలపై సమీక్ష నిర్వహించారు.అనంతరం అయన పలు కేంద్రాలను సందర్శినిచి మాట్లాడుతూ పాము, కుక్క కాటు మందుల నిల్వల పరిశీలన: PHCలో యాంటీ స్నేక్ వెనం (పాము కాటు మందు), రేబిస్ (కుక్క కాటు మందు) అందుబాటులో ఉన్నాయా లేదా అని పరిశీలించారు. ఇప్పటివరకు వినియోగించిన మందుల వివరాలపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు: ఇటీవల మదనాపూర్ మండలంలో జరిగిన పాము కాటు ఘటనపై ఆరా తీశారు. బాధితులు ఆసుపత్రికి రాగానే వెంటనే స్పందించి సకాలంలో మెరుగైన వైద్యం అందించాలని స్పష్టం చేశారు. గర్భిణులకు మెరుగైన వైద్యం: ఆసుపత్రికి వచ్చిన గర్భిణి పార్వతితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి గర్భిణికి హెమోగ్లోబిన్ పరీక్ష నిర్వహించి, రక్తహీనత ఉన్నవారికి తగిన మందులు పంపిణీ చేయాలని సూచించారు. కానాయిపల్లి ఆర్అండ్ఆర్ కేంద్రంలో సమస్యల పరిష్కారం: ఆర్అండ్ఆర్ కేంద్రాన్ని సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు. స్థానికులు తెలిపిన లెవలింగ్ పనులు, వర్షపు నీరు నిలవకుండా డ్రైనేజీ వ్యవస్థను త్వరితగతిన ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు: కొత్తకోట జెడ్పీహెచ్ఎస్ ఉర్దూ మీడియం పాఠశాలను తనిఖీ చేశారు. ఫిజిక్స్, ఇంగ్లీష్, గణితంలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ పర్యటనలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, జెడ్పీ సీఈవో యాదయ్య, డీఎంహెచ్వో భాస్కర్ నాయక్, నీటి పారుదల శాఖ అధికారులు డిప్యూటీ సీఈ వెంకట్రెడ్డి, ఎస్ఈ చంద్రశేఖర్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.
0 Comments