వన మహోత్సవం లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి:- అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్
వనపర్తి, ఆగష్టు 18 ( రైజింగ్ సన్ న్యూస్):వనపర్తి జిల్లాలో వన మహోత్సవం లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖిమ్యా నాయక్ ఆదేశించారు. మంగళవారం ఆయన 5అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి వన మహోత్సవం, పంట మార్పిడి, పింఛన్ల దరఖాస్తులపై సమీక్ష జరిపారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు వన మహోత్సవంలో 60 శాతం మొక్కల నాటే ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన లక్ష్యాన్ని త్వరగా సాధించడంతో పాటు మొక్కల సంరక్షణకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు వరికి బదులుగా వేరుశెనగ, మినుములు, ఆముదం వంటి తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటల వైపు మళ్లేలా వ్యవసాయ శాఖ ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. అలాగే, అర్హులైన దివ్యాంగులు, ఒంటరి మహిళలు తదితరులు పింఛన్ల కోసం ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకునేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
0 Comments