Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

విద్యారంగ సమస్యలపై ఏఐఎస్ఎఫ్ అలుపెరుగని పోరాటం: ఏఐఎస్ఎఫ్ వనపర్తి జిల్లా ఇన్చార్జ్ రమేష్

 విద్యారంగ సమస్యలపై ఏఐఎస్ఎఫ్ అలుపెరుగని పోరాటం: ఏఐఎస్ఎఫ్ వనపర్తి జిల్లా ఇన్చార్జ్ రమేష్



వనపర్తి, ఆగస్టు 12( రైజింగ్ సన్ న్యూస్):  విద్యార్థులు నేడు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని వారి సమస్యల పరిష్కారానికి ఏఐఎస్ఎఫ్ అలుపెరుగని పోరాటం చేస్తుందని ఏఐఎస్ఎఫ్ వనపర్తి జిల్లా ఇన్చార్జ్ రమేష్ అన్నారు. మంగళవారం సిపిఐ ఆఫీస్ వద్ద ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు వంశీ అధ్యక్షత వహించారు. మాట్లాడుతూ.. 1936లో ఉత్తరప్రదేశ్ లక్నో బెనారస్ విశ్వవిద్యాలయంలో బబురుద్దీన్, ప్రేమ్ నారాయణ భార్గవ్ ల ఆధ్వర్యంలో ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించిందన్నారు. చదువుతూ పోరాడు చదువుకై పోరాడు నినాదంతో ఏఐఎస్ఎఫ్ పోరాడుతుందన్నారు. విద్యా రంగానికి కేంద్రం 10% రాష్ట్ర ప్రభుత్వం 30% నిధులను కేటాయించాలని డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయన్నారు. నీట్ పరీక్ష పరీక్ష పత్రం లీకేజీ తో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారన్నారు. బీజేపీ పోరాటానికి ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ కూడా మద్దతు పలికాయి అన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను నడపడంలో కేంద్రం ఇప్పలమైందన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 23 వేలకు కుదిస్తామనటం దుర్మార్గమన్నారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ 8000 కోట్లు బకాయి చెల్లించడంలో విఫలమయ్యారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు చదువు అంది ఎందుకు అన్ని రకాల చర్యలు చేపట్టేందుకు పోరాడుతామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు.

💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి