Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

కానయపల్లి పునరావాస కేంద్రంలో మౌలిక వసతుల కొరకు 7.8 కోట్ల నిధులు విడుదల - దేవరకద్ర శాసన సభ్యులు జి. మధుసూదన్ రెడ్డి

 కానయపల్లి పునరావాస కేంద్రంలో మౌలిక వసతుల కొరకు 7.8 కోట్ల నిధులు విడుదల - దేవరకద్ర శాసన సభ్యులు జి. మధుసూదన్ రెడ్డి

-  కానయపల్లి పునరావాస కేంద్రం పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలి - దేవరకద్ర శాసన సభ్యులు జి. మధుసూదన్ రెడ్డి

వనపర్తి, ఆగస్టు 12( రైజింగ్ సన్ న్యూస్): శంకరసముద్రం రిజర్వాయర్ నిర్వాసితులకు పునరావాస కేంద్రంలో ఇళ్లు నిర్మించుకోవడానికి వీలుగా  మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం 7.8 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసినట్లు దేవరకద్ర శాసన సభ్యులు జి మధుసూదన్ రెడ్డి గ్రామస్తులకు వివరించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి కానాయపల్లి నిర్వసితులతో  మాట్లాడారు.  జిల్లా కలెక్టర్ చొరవతో పునరావాస కేంద్రం స్థలంలో మట్టి నింపి భూమి చదును చేయడానికి, వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైన్ నిర్మాణం, శ్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణానికి, వీధి దీపాల ఏర్పాటుకు ఇట్టి నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. స్థలం చదును చేసి జాబితాలో ఉన్న 1129 మంది నిర్వాసితులకు సమానంగా ప్లాట్లు కేటాయించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.  నిర్వాసితులకు రావలసిన పరిహారం చెల్లించి పునరావాస కేంద్రం పూర్తి చేయడానికి  రాష్ట్ర కేబినెట్ లో చర్చించాలని మంత్రులను కోరినట్లు వివరించారు. పునరావాస కేంద్రం పనులు త్వరలో ప్రారంభించేందుకు అందరూ సహకరించాలని కోరారు.

 కానాయపల్లి భూ నిర్వాసితులు, తదితరులు పాల్గొన్నారు.

💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి