Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

పోతిరెడ్డిపాడు సందర్శనకు వెళ్లిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అడ్డగింత

పోతిరెడ్డిపాడు సందర్శనకు వెళ్లిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అడ్డగింత
 - ఏపీ పోలీసుల తీరుపై హైవేపైనే నిరసన
 - తెలంగాణ జలాలను ఆంధ్రాకు దోచిపెడుతున్నారంటూ రేవంత్ ప్రభుత్వంపై ఆగ్రహం 


వనపర్తి, ఆగస్టు 14( రైజింగ్ సన్ న్యూస్):   శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను పరిశీలించి, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు వెళ్తున్న ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని జూపాడుబంగ్లా వద్ద నేషనల్ హైవేపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ ఆయన హైవేపైనే బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ పోలీసుల తీరును, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. బానిసత్వపు పాలన సాగుతోంది: నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ నీళ్లను ఏపీకి ధారాధత్తం చేసే బానిస ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తోందని మండిపడ్డారు. ఏపీలో పంటలు పండటాన్ని తాము తప్పుపట్టడం లేదని, కానీ కృష్ణా నదిలో పోతిరెడ్డిపాడు ద్వారా గ్రావిటీతో రోజుకు నాలుగైదు టీఎంసీల నీటిని తరలిస్తున్నారని తెలిపారు. కానీ తెలంగాణ వైపు మాత్రం 802 అడుగుల దిగువన మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

 ప్రభుత్వంపై నిరంజన్ రెడ్డి సంధించిన ముఖ్యమైన అంశాలు: 

 వివక్షత: కేఎల్ఐ (కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్) లో మూడు పంపులు మాత్రమే పనిచేస్తున్నాయని, కేవలం 0.2 టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోయగలమని, ఐదారు రోజులు ఎత్తిపోస్తేనే ఒక టీఎంసీ అవుతుందని వివరించారు. ఏపీకి ఇస్తున్నప్పుడు తెలంగాణకు ఎందుకు నీళ్లివ్వడం లేదని ప్రశ్నించారు. ఎల్నినో సాకు: ఎల్నినో ప్రభావం రెండు రాష్ట్రాలకు ఒకేలా ఉంటుందని, తెలంగాణకు మాత్రం వేరుగా ఉండదని స్పష్టం చేశారు. వైఫల్యాలు: కల్వకుర్తి మోటార్లు సరిగా నడపడం లేదని, తాము ఒత్తిడి తెచ్చేవరకు నీళ్లు విడుదల చేయలేదని మండిపడ్డారు. 162 కిలోమీటర్ల పొడవు ఉండే కాలువలో కనీసం 102 కిలోమీటర్ల దూరం కూడా నీళ్లు పారలేదన్నారు. నీటి లభ్యత: జూరాల నుంచి ఎగువన 80 వేల క్యూసెక్కుల వరద శ్రీశైలానికి చేరుతోందని, జూరాల ఆయకట్టుకు, లిఫ్ట్ లకు నీటి ఇబ్బంది లేదని చెప్పారు. దోపిడీ: పోతిరెడ్డిపాడు ద్వారా 8, 9 వేల క్యూసెక్కులు మాత్రమే డ్రా చేస్తున్నామని చెబుతూనే, వాస్తవానికి 50 వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో శ్రీశైలంలో 100 టీఎంసీలు ఉన్నప్పుడే 40 టీఎంసీల నీటిని రైతులకు అందించామని గుర్తుచేశారు. బాధ్యత లేమి: పాలమూరు జిల్లాకు నీళ్లు దక్కకుండా చేస్తున్నారని, జిల్లా ఎమ్మెల్యేలకు, మంత్రులకు కనీస బాధ్యత లేకుండాపోయిందని నిప్పులు చెరిగారు. మన నీళ్లను మనకు దక్కకుండా చేసి, అన్యాయం చేస్తుంటే ప్రశ్నించకుండా మౌనంగా ఉండటం దుర్మార్గమన్నారు. రైతుల ప్రయోజనాలను కాలరాస్తున్న తీరుపై తెలంగాణ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలనే తాము ఈ పర్యటనకు వెళ్లామని, రైతులకు సంబంధించిన ప్రాజెక్టును చూడటానికి వెళ్తే అడ్డుకోవడం ఏంటని నిలదీశారు.

ఆంధ్ర జలదోపిడీని అడ్డుకోవాల్సిందే.. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి   
    

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాగిస్తున్న జలదోపిడీని అడ్డుకోవడానికి, ఎల్నినో పేరుతో సాగునీటిని తరలిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడానికి బయలుదేరిన ఉమ్మడి పాలమూరు జిల్లా మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. భారీ కాన్వాయ్‌తో పోతిరెడ్డిపాడు సందర్శనకు తరలిన ఆయనను, ఏపీ ప్రభుత్వ అధికారులు మరియు పోలీసుల సహకారంతో తెలంగాణ ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టించింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సమీపంలో ఆంధ్రా పోలీసులు ఆయనను అడ్డుకుని హంగామా సృష్టించారు.

పోలీస్ వలయాన్ని ఛేదించే యత్నం.. హైవేపై నిరసన: పోలీసులు అడ్డుకున్నప్పటికీ వెనక్కి తగ్గకుండా, మొండి పట్టుదలతో పోలీస్ వలయాన్ని ఛేదించేందుకు నిరంజన్ రెడ్డి ప్రయత్నించారు. అయితే అది సాధ్యం కాకపోవడంతో, పోలీసుల ఏకపక్ష చర్యలను తీవ్రంగా ఖాండిస్తూ ఆయన జూపాడుబంగ్లా వద్ద నేషనల్ హైవేపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కుట్రలను భగ్నం చేయడానికి తాము పక్కా ప్రణాళికతో వస్తే, ఇలా అడ్డుకోవడం అన్యాయమని ఆయన మండిపడ్డారు.


💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి