Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

పట్టణ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా చర్యలు...

 పట్టణ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా చర్యలు...   


 
వనపర్తి, ఆగస్టు 14( రైజింగ్ సన్ న్యూస్):   ప్లాస్టిక్ వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా పట్టణ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖిమ్యా నాయక్ ఆదేశించారు.  పెబ్బేరు పట్టణంలోని ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖిమ్యా నాయక్ గురువారం సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రంలో జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిని, మౌలిక వసతుల ఏర్పాటును అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ ప్రక్రియను ప్రారంభించాలని సంబంధిత అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు. అలాగే, కేంద్రానికి అవసరమైన ఫెన్సింగ్ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, మిగిలిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కేంద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ, వేరు చేయడం, నిర్వహణకు అవసరమైన మౌలిక వసతుల ఏర్పాటుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా పట్టణ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా చర్యలు చేపట్టాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో పీడీ, డీఆర్‌డీఏ, పెబ్బేరు మున్సిపల్ కమిషనర్, ఏఈ (పంచాయతీరాజ్) మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి