Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

బండారునగర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ చేతుల మీదుగా ఏక రూప దుస్తుల పంపిణీ

బండారునగర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ చేతుల మీదుగా ఏక రూప దుస్తుల పంపిణీ
వనపర్తి, ఆగస్టు 12 (రైజింగ్ సన్ న్యూస్): ​వనపర్తి మండలంలోని బండారునగర్ ప్రాథమిక పాఠశాలలో స్థానిక సంస్థల అదనపు జిల్లా కలెక్టర్ శ్రీ ఖీమ్యా నాయక్ గారు విచ్చేసి విద్యార్థులకు స్కూల్ యూనిఫాం ల కార్యక్రమం పాల్గోని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు, పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందజేస్తున్నట్లు తెలిపారు. కావున విద్యార్థులందరూ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని, మంచి విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ​ఈ కార్యక్రమంలో జిల్లా కమ్యూనిటీ అధికారి శ్రీ ప్రతాపరెడ్డి, మండల విద్యాధికారి శ్రీ మద్దిలేటి, మెప్మా ప్రతినిధులు శ్రీ బాలరాజు, ప్రధానోపాధ్యాయులు శ్రీ వెంకటయ్య, పాఠశాల ఉపాధ్యాయులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి