నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి జూపల్లి కృష్ణరావు
వనపర్తి, ఆగస్టు 12 (రైజింగ్ సన్ న్యూస్):
సమాజంలో ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అమలు చేస్తున్న తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) నిరక్షరాస్యులకు అక్షర వెలుగులు పంచుతోందని, జిల్లాలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే పూర్తి బాధ్యత కోఆర్డినేషన్ కేంద్రాలపైనే ఉందని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణరావు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమం అనంతరం తెలంగాణ ఓపెన్ స్కూల్ నూతన అడ్మిషన్ల కరపత్రాలు, పోస్టర్లను మంత్రి జూపల్లి కృష్ణరావు చేతుల మీదుగా ఘనంగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా బుధవారం గాయత్రి కళాశాల ప్రాంగణంలో సెంటర్ కోఆర్డినేటర్ల కోసం ప్రత్యేక ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా తెలంగాణ ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ శివయ్య ముఖ్య అతిథిగా హాజరై కోఆర్డినేటర్ల సందేహాలను నివృత్తి చేస్తూ పలు సలహాలు, సూచనలు అందించారు.
ఉల్లాస్ కార్యక్రమంతో అద్భుత అవకాశాలు
జిల్లాలో డీఆర్డీఏ (DRDA) ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులను 'ఉల్లాస్' కార్యక్రమం ద్వారా అక్షరాస్యులుగా మారుస్తున్నామని, ఇదే స్ఫూర్తితో ఆ మహిళలను తెలంగాణ ఓపెన్ స్కూల్లోనూ చేర్పించి వారికి ఉన్నత చదువులు, ఉపాధి అవకాశాలు కల్పించేలా కోఆర్డినేటర్లు ప్రత్యేక చొరవ చూపాలని శివయ్య పిలుపునిచ్చారు. ఈ బృహత్ కార్యక్రమంలో భాగస్వాములవుతున్న ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు.
మునుపటి రికార్డులపై హర్షం
గత ఏప్రిల్ నెలలో నిర్వహించిన వార్షిక పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల్లో మన జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమని జిల్లా కోఆర్డినేటర్ రవీందర్ రెడ్డి, సీఎంఓ ప్రతాప్ రెడ్డి, డీఆర్డీఏ బీపీఎంలు కొనియాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్లు, వివిధ కేంద్రాల సెంటర్ కోఆర్డినేటర్లు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొ
న్నారు.


0 Comments