Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

వనపర్తిలో ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం

 వనపర్తిలో ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం



వనపర్తి, ఆగస్టు 11 (రైజింగ్ సన్ న్యూస్): హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలో జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమ జిల్లా కన్వీనర్ బచ్చు రాము ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు దుప్పల్లి నారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వనపర్తి పాలిటెక్నిక్‌ కళాశాల ఎదుట ప్రధాన రహదారుల కూడలి వద్ద కార్యక్రమాన్ని నిర్వహించి, అటుగా వచ్చి వెళ్లే వాహనదారులకు జాతీయ త్రివర్ణ పతాకాలను పంపిణీ చేశారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి భావాన్ని చాటాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హర్‌ ఘర్‌ తిరంగా జిల్లా కన్వీనర్ బచ్చు రాము, రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి, సబీరెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేతూరి బుడ్డన్న, ఆర్. వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు, జిల్లా ఉపాధ్యక్షులు బాసెట్టి శ్రీనివాసులు, మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అలివేలమ్మ, జిల్లా కోశాధికారి బండారు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి