Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

పాత జి.ఓలకు పాలకుల హడావుడి

 పాత జి.ఓలకు   పాలకుల హడావుడి

.

నందిమల్ల.అశోక్ బిఆర్ఎస్ జిల్లా మీడియా కన్వీనర్

 వనపర్తి  జులై 08 (రైజింగ్ సన్ న్యూస్):మాజీ సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి  చేసిన అభివృద్ధిలో ఐదు పైసల వంతు అభివృద్ధి చేయకుండా ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి రోజుకో ఒక శంకుస్థాపన,పది ప్రగల్భాలతో కాలం వెళ్ళిబుచడం ఎమ్మెలకు పరిపాటి అయ్యిందనీ బిఆర్ ఎస్ నాయకులు నందిమల్ల అశోక్ ఆరోపించారు. పాలిటెక్నిక్ ఆధునీకరణ(దురస్తూ)కోసం G.O.Rt.NO.325 dated11.08.2023రోజు 13కోట్ల 40లక్షలు  నిరంజన్ రెడ్డి  మంజూరు చేయించారనీ,దీనితో పాటు బాయ్స్, గర్ల్స్ హాస్టల్ సముదాయాలకు కూడా నిధులు మంజూరు చేయించరన్నారనీ.సాక్ష్యాత్తు ఐ.టి శాఖ మాత్యులు కె.టి.ఆర్ తో శంకుస్థాపన చేయించారన్నారు. నేడు 10కోట్ల రూపాయలతో పాలిటెక్నిక్ ఆధునీకరణ పనుల కోసం మళ్ళీ పొంగులేటితో శంకుస్థాపన చేయించడం అంటే ప్రజలను మభ్యపెట్టడమేని జిల్లా  నందిమల్ల.అశోక్ విమర్శించారు. ఐ.టి టవర్ కోసం  నిరంజన్ రెడ్డి  22కోట్ల తో మంజూరు చేయిస్తే, చెరువులో శంకుస్థాపన చేయించారని గగ్గోలు పెట్టీ శిలాఫలకాలు ధ్వంసం చేసి నానా యాగీ చేసి సిగ్గుతప్పినోడి లాగా మళ్ళీ యధాస్థానంలో శంకుస్థాపన చేయించడం ఎమ్మెల్యేకే చెల్లిందనీ విమర్శించారు.  ప్రజలారా ఆలోచించండి అసత్య ఆరోపణలు చేసి అందలం ఎక్కిన మన పాలకులు చేస్తున్న అభివృద్ధి ఏ దశలో ఉందో గమనించాలన్నారు.

గ్రామాలంటే మంత్రులకు భయమా? 

మంత్రులు,ఎం.ఎల్. ఏలు గ్రామాలలో పర్యటిస్తే తాము ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తారని రైతులకు సకాలములో రైతు భరోసా రైతు రుణ మాఫీ, యూరియా కొరత,ధాన్యానికి బోనస్ సాగునీళ్ళు,కరెంట్ కోతల గూర్చి  మహిళలకు 2500,వృద్ధులకు 4000,దివ్యాంగులకు 6000,కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం, నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు విద్యార్థినులకు స్కూటీలు విద్యా బరోసా వంటి పథకాలు నిధులు లేక నిర్వీర్యం అయిన గ్రామ పంచాయతీల తీరు గురించి నిలదీస్తారని భయపడి జిల్లా కేంద్రంలోనే శంకుస్థాపనలకు పరిమితం కావడం సిగ్గుచేటని నందిమల్ల.అశోక్ దుయ్యబట్టారు.

జిల్లా కేంద్రములో అభివృద్ధి నిల్ ప్రచారం ఫుల్

 శిలాఫలకాలు జిల్లా కేంద్రములో దిష్టిబొమ్మలను తలపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రగల్భాలు మాని పనిమంతులు అనిపించుకోవాలని హితవు పలికారు.

💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి