Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

బీజేపీ జిల్లా కార్యాలయ కార్యదర్శిగా ధ్యారపోగు సుబ్రహ్మణ్యం

 బీజేపీ జిల్లా కార్యాలయ కార్యదర్శిగా ధ్యారపోగు సుబ్రహ్మణ్యం

వనపర్తి, జూలై 8: భారతీయ జనతా పార్టీ వనపర్తి జిల్లా కార్యాలయ కార్యదర్శిగా వనపర్తికి చెందిన ధ్యారపోగు సుబ్రహ్మణ్యంను నియమించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు దుప్పల్లి నారాయణ నియామక పత్రాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు సంస్థాగత బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని జిల్లా అధ్యక్షుడు సూచించారు. బాధ్యతలు స్వీకరించిన సుబ్రహ్మణ్యం తనపై పార్టీ ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలుపుతూ, పార్టీ అభివృద్ధి, విస్తరణ కోసం నిబద్ధతతో కృషి చేస్తానని చెప్పారు.కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ ఆర్. లోకనాథ్ రెడ్డి, రాష్ట్ర మాజీ కౌన్సిల్ సభ్యుడు మున్నూరు రవీందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు.

💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి