Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు..

 పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు..


వనపర్తి , జూలై 8 (రైజింగ్ సన్ ప్రతినిధి న్యూస్)వనపర్తి పట్టణంలో పలు అభివృద్ధి పనులకు  రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంఖుస్థాపన చేశారు. బుధవారం  రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వనపర్తి జిల్లాలో పర్యటించి సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు , వాకిటి శ్రీహరి, స్థానిక శాసన సభ్యులు తూడి మేఘారెడ్డి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ కే శివసేనారెడ్డితో కలిసి  పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు  చేశారు.పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పరిధిలో రూ.2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి శంకుస్థాపన చేశారు. ఆలయ అభివృద్ధి ద్వారా భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ఈ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.అంతకు ముందు ఆలయానికి చేరుకున్న మంత్రులకు  ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.  ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం  అర్చకులు  ఆశీర్వచనాలు   అందించి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.  అనంతరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రాజా గారి బంగ్లా పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పునరుద్ధరణతో పురాతన రాజ భవనానికి పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా రూ. 2.25 కోట్ల వ్యయంతో నిర్మించనున్న  రేవల్లి మండల కాంప్లెక్స్ సముదాయ నిర్మాణ పనులకు సైతం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు.  వనపర్తి జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రులకు అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఎన్ ఖీమ్య నాయక్,  జిల్లా ఎస్పీ డి. సునీత రెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, ఆర్డీఓ సుబ్రమణ్యం పూల మొక్కలు, పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికారు.ఈ కార్యక్రమాల్లో   వనపర్తి మున్సిపల్ ఛైర్పర్సన్ మాధవి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, వివిధ శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి