Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

తిమ్మాజిపేట బస్‌స్టేషన్‌కు కొత్త రూపు.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన

తిమ్మాజిపేట బస్‌స్టేషన్‌కు కొత్త రూపు.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన

తిమ్మాజిపేట, జూలై 8(రైజింగ్ సన్ న్యూస్): తిమ్మాజిపేటలో టీజీఎస్‌ఆర్టీసీ బస్‌స్టేషన్ ఆధునికీకరణ పనులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ పనులు పూర్తయితే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందడంతో పాటు మండల రవాణా వ్యవస్థ మరింత బలోపేతం కానుందని తెలిపారు.మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా రవాణా రంగాన్ని ఆధునికీకరిస్తోందని, ప్రతి నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో రవాణా, విద్య, వైద్యం తదితర రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలను దశలవారీగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో హేమంత్ కేశవ్ పాటిల్, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి