భారత ఐక్యత సమగ్రత కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు డా.శ్యామా ప్రసాద్ ముఖర్జీ
బిజెపి జిల్లా అధ్యక్షుడు డి. నారాయణ
భారత ఐక్యత, సమగ్రత కోసం తన సర్వస్వాన్ని అర్పించిన మన సిద్ధాంతకర్త, భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, గొప్ప విద్యావేత్త డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా ఈరోజు నాగవరంలోని బిజెపి జిల్లా పార్టీ నూతన కార్యాలయంలో ఆ మహనేతకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథి హాజరైన బిజెపి జిల్లా అధ్యక్షులు డి.నారాయణ మాట్లాడుతూ ఉన్నత విద్యావంతుడు రాజనీతిజ్ఞుడు 33 ఏళ్లకే ప్రసిద్ధ కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా సేవలందించిన డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారు మొదటిగా కాంగ్రెస్ పార్టీ ద్వారా బెంగాల్ శాసనసభకు ఎన్నికైనా హిందూ మహాసభ అధ్యక్షుడిగా పనిచేశారని,1947లో నెహ్రూ తొలి మంత్రివర్గంలో పరిశ్రమలు మరియు సరఫరాల శాఖ మంత్రి గా విశేష సేవలందించిన ముఖర్జీ గారు నెహ్రూ లియాఖత్ ఒప్పందానికి నిరసనగా 1950లో మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి 1951 అక్టోబర్ 21న కాంగ్రెస్ ఏక ఛత్రాధిపత్యానికి మైనార్టీ సంతుష్టీకరణ రాజకీయాలకు వ్యతిరేకంగా భారతీయ జన సంఘం ప్రారంభించి మొదటగా దీపం గుర్తుతో ఎన్నికల్లో పోటీచేసి తదనంతరం జనతాపార్టీ అనంతరం భారతీయ జనతా పార్టీ గా రూపాంతరం చెందిందని పేర్కొన్నారు.జమ్మూ కాశ్మీర్ కు నెహ్రూ తీసుకొచ్చిన ఆర్టికల్ 370& 35 ఏ ప్రత్యేక చట్టం ద్వారా భారత రాజ్యాంగం భారత జాతీయ పతాకం భారత ప్రధానమంత్రి జమ్ము కాశ్మీర్లో అమల్లో లేకపోవడం జమ్మూ కాశ్మీర్ పర్యటనకు పర్మిట్ విధానాలకు వ్యతిరేకంగా ఏక్ దేశ్ మే దో విధాన్ దో నిదాన్ ఔర్ ద్రో ప్రధాన్ నహీ చలేగా అని గర్జించి పర్మిట్ లేకుండా జమ్ము కాశ్మీర్ లో అడుగుపెట్టిన ముఖర్జీ గారిని కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి వైద్య చికిత్సలు అందించకుండా జైలులోనే విష ప్రయోగం ద్వారా చంపించడం జరిగిందని, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2019లో ఆర్టికల్ 370& 35A ప్రత్యేక చట్టాలను రద్దు పరచి డా.శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారికి నివాళులర్పించడం జరిగిందని డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారిని మనమందరం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ బిజెపి రాష్ట్ర నాయకులు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఆర్.లోకనాథ్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు శ్రీనివాస్ గౌడ్ వారణాసి కల్పన జిల్లా కోశాధికారి బండారు కుమారస్వామి కార్యదర్శి కాటమొని కృష్ణ గౌడ్ సీనియర్ నాయకులు బచ్చు రాము బోయల రాము అశ్విని రాధ కౌన్సిలర్ విజయసాగర్ జిల్లా అధికార ప్రతినిధి నక్క మహేష్ యువమోర్చా జిల్లా అధ్యక్షులు నలబోతుల అరవింద్ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు గంధం ప్రవీణ్ మాజీ కౌన్సిలర్లు గోపాల్ యాదవ్ కంచరవి నాయకులు రాయన్న సాగర్ వెంకటేష్ నాయక్ చిన్న రాయుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
రైజింగ్ సన్ తెలుగు దినపత్రిక
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, విద్య, వ్యాపార, క్రీడలు, ఆరోగ్యం మరియు ఇతర ముఖ్యమైన వార్తలను వేగంగా, విశ్వసనీయంగా అందించడమే రైజింగ్ సన్ లక్ష్యం. ప్రజా సమస్యలకు ప్రాధాన్యత ఇస్తూ, వాస్తవాలను ఆధారంగా చేసుకుని నిష్పక్షపాత వార్తలను అందించేందుకు మేము కృషి చేస్తున్నాము. తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రత్యేక కథనాల కోసం రైజింగ్ సన్ను అనుసరించండి.
రైజింగ్ సన్ – ప్రజల కోసం... ప్రజల గొంతుకగా...
0 Comments