Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

కనీసవేతనం రూ. 26,000 ఇవ్వాలి.. పెండింగ్ జీతం చెల్లించాలి: మోష

 కనీసవేతనం రూ. 26,000 ఇవ్వాలి.. పెండింగ్ జీతం చెల్లించాలి: మోష


రాష్ట్రంలో పనిచేస్తున్న 5000 మంది స్కూలు స్వీపర్లకు కనీస వేతనం రూ. 26000 ఇవ్వాలని స్కూలు స్వీపర్స్ యూనియన్ (ఏఐటియుసి అనుబంధం) రాష్ట్ర అధ్యక్షుడు మోష డిమాండ్ చేశారు. సోమవారం వనపర్తి జిల్లా జడ్పిసిఓ ఆఫీస్ వద్ద నిరసన తెలిపారు. జెడ్పి సీఈవో యాదయ్యకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వీపర్లకు నాలుగు నెలలుగా  వేతనాలు చెల్లించటం లేదని, ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్వీపర్లు గత 30 ఏళ్లుగా అతి తక్కువ వేతనానికి పాఠశాలల్లో పని చేస్తున్నారన్నారు. ప్రస్తుతం  నెలకు రూ. 5200 మాత్రమే ఇస్తున్నారని, దానితో వారి బతుకులు గడవడం లేదన్నారు. కనీస వేతనం రూ. 26,000 ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం దారుణం అన్నారు. కేవలం నెలకు రూ. 5200 అతి తక్కువ వేతనంతో స్వీపర్లు పనిచేస్తున్నా, కొన్ని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు టీచర్లు వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. స్వీపర్లు పాఠశాలలకు ముందే స్కూళ్లకు వెళ్లి శుభ్రం చేసి విద్యార్థులకు టీచర్లకు తాగునీరు పెట్టి, సాయంత్రం బడి మూశాక తాళాలు వేసుకొని వెళ్లే విధులు మాత్రమే నిర్వహిస్తారు అన్నారు. ఇటీవల స్కూల్లకు స్కావెంజర్లను ప్రభుత్వం నియమించిందని, స్కావెంజర్లు పాఠశాల తెరిచాక మొక్కలకు నీళ్లు పోసి, మరుగుదొడ్లను శుభ్రం చేసే విధులు నిర్వహిస్తారన్నారు. కొత్తకోట మండలంలో కొందరు హెచ్ఎంలు స్కావెంజర్లను తీసివేస్తామని వారి పనితో పాటు స్వీపర్ల పని చేయాలని ఇబ్బందులు పెడుతున్నారని, స్కావెంజర్లు స్వీపర్లవి విధులు వేరువేరని గుర్తించకపోవడం అవగాహన రాహిత్యమని, వేధింపులు మానాలని లేదంటే యూనియన్ ఆధ్వర్యంలో ఆ పాఠశాలల వద్ద ఆందోళన చేస్తామన్నారు. సమస్యను జెడ్పిసిఓ దృష్టికి తీసుకెళ్లామని చిన్న ఉద్యోగులను వేధించవద్దని హెచ్ఎంలు టీచర్లకు ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. జిల్లా పాఠశాల స్వీపర్ల అసోసియేషన్ అధ్యక్షుడు గోపాల్ గౌడ్, కోశాధికారి అబ్దుల్ ఖయ్యూం, నాయకులు అభిమన్యు, మాలిక్, కురుమన్న, శాంతన్న, శ్రీనివాసులు, హకీమ్, తదితరులు పాల్గొన్నారు.

💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి