Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

ప్రపంచ విప్లవ చరిత్రలో చేగువేరా స్ఫూర్తిదాయక వ్యక్తి - సిపిఐ

 

ప్రపంచ విప్లవ ధ్రువతార చేగువేరా..



రైజింగ్ సన్ న్యూస్ ,వనపర్తి అక్టోబర్ 9: ప్రపంచ విప్లవ చరిత్రలో చేగువేరా స్ఫూర్తిదాయక వ్యక్తిగా నిలిచారని సీపీఐ వనపర్తి నియోజకవర్గ కార్యదర్శి రమేష్, కవి జనజ్వాల అన్నారు. శనివారం వనపర్తిలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో చేగువేరా 59వ వర్ధంతిని ప్రజా సంఘాల నాయకులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, సమసమాజ స్థాపన కోసం చేగువేరా పోరాడి ప్రాణత్యాగం చేశారని నాయకులు పేర్కొన్నారు. గెరిల్లా పోరాటంలో ఆయన ప్రదర్శించిన తెగువ భావితరాలకు ఆదర్శమని కొనియాడారు. విప్లవ యోధుడిగా, బహుభాషా కోవిదుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన పోషించిన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ప్రపంచ యువతకు చేగువేరా స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ అంతరాలు లేని సోషలిస్టు సమాజ నిర్మాణానికి యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదే ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు నరసింహశెట్టి, పట్టణ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పృథ్వినాదం, ఏఐపీఎస్‌ఓ జిల్లా సమన్వయ కార్యదర్శి ఎత్తం శివ, సామాజిక కార్యకర్త గంధం నాగరాజు, సీపీఐ(ఎంఎల్‌) జిల్లా నాయకుడు గణేష్‌తో పాటు సురేష్‌, రామచంద్రయ్య, విజయ్‌, శ్రీకాంత్‌, వెంకటప్ప, తిరుమలేష్‌ తదితరులు పాల్గొన్నారు. తిరుమలేష్‌, నాగరాజు విప్లవ గీతాలు ఆలపించారు.

💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి