Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

వికలాంగుల భార్యలకు వెంటనే పింఛన్ మంజూరు చేయాలి

 

వికలాంగుల భార్యలకు వెంటనే పింఛన్ మంజూరు చేయాలి

• కలెక్టర్‌కు విహెచ్‌పిఎస్ వనపర్తి జిల్లా కమిటీ వినతిపత్రం

వనపర్తి (కలెక్టరేట్), ఆగస్టు 11: జిల్లాలో పింఛన్ పొందుతూ మరణించిన వికలాంగుల స్థానంలో, వారి భార్యలకు వెంటనే పింఛన్ మంజూరు చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి (VHPS) వనపర్తి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌కు సంఘం జిల్లా అధ్యక్షుడు మకాం శ్రీనివాసులు ఆధ్వర్యంలో నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు ಮಾತనాడారు. జిల్లాలో వేలాది మంది వికలాంగులు ప్రభుత్వ పింఛన్‌పైనే ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు. అయితే, పింఛన్ పొందుతున్న వికలాంగుడు మరణించినప్పుడు వారి భార్యలకు తక్షణమే ఆ పింఛన్ వర్తింపజేసే స్పష్టమైన విధానం లేకపోవడంతో అనేక కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఇతర విభాగాల్లో పింఛన్‌దారులు మరణిస్తే వారి భార్యలకు పింఛన్ అందించే అవకాశం ఉన్నట్లే, వికలాంగుల కుటుంబాలకు కూడా ఈ సౌకర్యం కల్పించాలని కోరారు. కుటుంబానికి ప్రధాన ఆధారమైన వ్యక్తి దూరమవ్వడంతో వితంతువులైన మహిళలు తీవ్ర దిక్కుతోచని స్థితిలో పడుతున్నారన్నారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి, మరణించిన వికలాంగుల భార్యలకు వెంటనే పింఛన్ ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కొత్త పింఛన్లలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి ప్రభుత్వం నూతనంగా మంజూరు చేయనున్న ‘చేయూత’ పింఛన్లలో మరణించిన వికలాంగుల భార్యలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఆదుకోవాలని కలెక్టర్‌ను కోరారు. ఈ సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విహెచ్‌పిఎస్ నాయకులు ప్రభు స్వామి, రేణుక, ఉమా, మహనీయుల ఉత్సవ కమిటీ చైర్మన్ గంధం నాగరాజు, ఎమ్మార్పీఎస్ నాయకులు కొమ్ము చెన్నకేశవులు మాదిగ, మీసాల నాగరాజు మాదిగ, బచ్చలకూర పరమేష్ మాదిగ, అజయ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి