Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా _ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

☀️ RISING SUN
తెలుగు దినపత్రిక
DISTRICT

పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తా _ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

రిపోర్టర్: Nagaraju   |   ప్రాంతం: Wanaparthy
Rising Sun News Photo

- జీవో నెంబర్ 97 రద్దు చేయాలి: పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి వినతి

వనపర్తి, ఆగస్టు 20, (రైజింగ్ సన్ న్యూస్ ): రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతున్న జీవో నెంబర్ 97ను వెనక్కి తీసుకోవాలని, పాలిటెక్నిక్ విద్యాసంస్థలను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే చర్యలను నిలిపివేయాలని కోరుతూ వనపర్తి పాలిటెక్నిక్ విద్యార్థులు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసిన విద్యార్థులు జీవో నెంబర్ 97 ద్వారా తమ విద్యా భవిష్యత్తుపై ఏర్పడుతున్న అనుమానాలు, శక్తి స్కీమ్‌కు సంబంధించిన అంశాలు, పాలిటెక్నిక్ విద్యాసంస్థలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలపై తమ ఆందోళనను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.విద్యార్థుల సమస్యలను సానుకూలంగా విన్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి స్పందిస్తూ.. జీవో నెంబర్ 97 మరియు శక్తి స్కీమ్‌కు సంబంధించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా వారి భవిష్యత్తును కాపాడేందుకు పూర్తిగా కృషి చేస్తానని హామీ ఇఛ్చారు.

☀️ Rising Sun Telugu Daily
నిజం కోసం... ప్రజల కోసం... ☀️ Rising Sun
💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి