Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

అధికారులకు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశం



కొత్తకోట, జూలై 13 (రైజింగ్ సన్ న్యూస్) :జూలై 15న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కొత్తకోట పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవం, విద్యార్థులతో ముఖ్యమంత్రి నిర్వహించే ముఖాముఖి కార్యక్రమానికి సంబంధించి సోమవారం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సమీక్ష సమావేశం నిర్వహించారు.సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ కార్యక్రమం జరిగే ప్రాంగణంలో బారికేడ్లు, వేదిక, సౌండ్ సిస్టమ్, విద్యుత్, తాగునీరు తదితర ఏర్పాట్లను ఎలాంటి లోపాలు లేకుండా పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి విద్యార్థులతో నిర్వహించే ముఖాముఖి కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని సాంకేతిక ఏర్పాట్లు సమర్థంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.9వ, 10వ తరగతి విద్యార్థులకు కూర్చునే ఏర్పాట్లు, కార్పెట్లు, తరగతి గదుల్లో ఫర్నిచర్, తాగునీరు, అల్పాహారం అందుబాటులో ఉంచాలని సూచించారు. విద్యార్థుల రాకపోకలకు ప్రత్యేక బృందాలను నియమించి కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండి కార్యక్రమం విజయవంతానికి కృషి చేయాలని స్పష్టం చేశారు.జిల్లా ఎస్పీ సునీతా రెడ్డి పోలీసు బందోబస్తుపై అధికారులకు దిశానిర్దేశం చేస్తూ ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు, వీఐపీ రూట్, ప్రజల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. అనంతరం సీఎం హెలికాప్టర్ దిగనున్న హెలిప్యాడ్‌ను పరిశీలించి భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. బారికేడ్ల ఏర్పాటుపై ఆర్‌అండ్‌బీ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.సమావేశంలో అదనపు ఎస్పీ వీరారెడ్డి, జడ్పీ సీఈవో యాదయ్య, ఆర్‌అండ్‌బీ అధికారి దేశ్యా నాయక్, మున్సిపల్ కమిషనర్ సైదయ్య, మార్కెట్ యార్డ్ చైర్మన్ పి. ప్రశాంత్, నాయకులు పి. కృష్ణారెడ్డి, ఎన్.జె. బోయెజ్, చర్లపల్లి శేఖర్ రెడ్డి, బీచుపల్లి యాదవ్, నరేందర్ సాగర్, అంజి సాగర్, వివిధ శాఖల అధికారులు, విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి