Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

పాత వెంచర్ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌పై నిషేధం ఎత్తివేయాలి

పాత వెంచర్ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌పై నిషేధం ఎత్తివేయాలి

ప్రభుత్వ నిర్ణయంతో రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర సంక్షోభంలో పడింది: నందిమల్ల అశోక్




పాత వెంచర్ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్‌ఎస్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పటికే కుదేలైన రియల్ ఎస్టేట్ రంగం మరింత సంక్షోభంలోకి వెళ్లిందని ఆయన ఆరోపించారు.సోమవారం వనపర్తిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించిన పాత వెంచర్ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మధ్యవర్తులకు కొంత ఊరట లభించిందన్నారు. అయితే ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో పాత వెంచర్ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేయడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడిన వేలాది మంది వ్యాపారులు, ఏజెంట్లు, మధ్యవర్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.రియల్ ఎస్టేట్ రంగంలో తీవ్ర మందగమనం కారణంగా భూముల ధరలు గణనీయంగా పడిపోయాయని, కొనుగోలు విక్రయాలు నిలిచిపోవడంతో ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. అప్పులు తీర్చలేక, కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, వివాహాలు, ఇళ్ల నిర్మాణాలు వాయిదా వేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం వెంటనే సంబంధిత ఉత్తర్వులను పునఃసమీక్షించి పాత వెంచర్ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇవ్వాలని, రియల్ ఎస్టేట్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని నందిమల్ల అశోక్ డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో గంధం పరంజ్యోతి, జోహెబ్ హుస్సేన్, చిట్యాల రాము తదితరులు పాల్గొన్నారు. 

💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి