Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

సీజెపి ఉద్యమం అణచివేతలో కేంద్రం క్రూరత్వం: సిపిఐ

 సీజెపి ఉద్యమం అణచివేతలో కేంద్రం క్రూరత్వం: సిపిఐ

వనపర్తి, జులై 30( రైజింగ్ సన్ న్యూస్): సిజేపీ ఉద్యమం అణచివేతకు కేంద్రం తీసుకున్న క్రూర చర్యలు రాజ్యాంగ హక్కులను, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేశాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల నరసింహ విమర్శించారు. బుధవారం గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగిన వనపర్తి సిపిఐ జిల్లా సమితి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీకేజీ పై ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద సిజేపీ ఉద్యమాన్ని అణచివేసేందుకు లాఠీలు పెల్లెట్ గన్నులు, భాష్పవాయు గోళాలతో పోలీసులు క్రూరాతి క్రూరంగా దాడి చేయడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అన్నారు. మహిళలపై మగ పోలీసుల నీచమైన దాడి గత ఏ ప్రభుత్వాల్లో జరగలేదన్నారు. మహిళలను గౌరవిస్తామని బిజెపి మాటలు చేతల్లో లేవన్నారు. అవినీతికి వ్యతిరేకంగా అన్న హజారే చేపట్టిన ఉద్యమం సందర్భంగా ఆనాటి ప్రభుత్వం, ఉద్యమాన్ని, మీడియా మాధ్యమాలను అణచివేస్తే ప్రయత్నం చేయలేదన్నారు. నీట్ పేపరు రద్దుకు వ్యతిరేకంగా పలు డిమాండ్లతో ఉద్యమిస్తే విచక్షణ రహితమైన దాడులు, వాటిని బయటకు పొక్కకుండా మీడియాను మేనేజ్ చేశారని, సోషల్ మీడియా ప్రభావంతో ఉద్యమం తీవ్ర రూపం దాల్చిందన్నారు. యువత మొక్కవోని ధైర్యంతో పోరాడి డిమాండ్లను సాధించారని, వారి ఉద్యమ విజయం ప్రజాస్వామ్య ఉద్యమాలకు ప్రేరణ అన్నారు. నిరుద్యోగం, విద్య, వైద్యం, హామీల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంలో వైఫల్యం ఇవన్నీ యువతలో గూడుకట్టుకొని పేపర్ లీకేజీ రూపంలో ఆగ్రహం బయటపడిందన్నారు. ఇటీవల కొన్ని దేశాల్లో యువత ఆగ్రహంతో గత ప్రభుత్వాలు కూలిపోయి యువత ఆకాంక్షల మేరకు కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి అన్నారు. యువత విద్యార్థులపై విచక్షణ రహితమైన లాఠీచార్జి పై అత్యున్నత విచారణ జరిపించి దోషులను శిక్షించాలన్నారు. మహిళలపై అమానుషంగా ప్రవర్తించిన మగ పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. బీహార్లో యువతపై ఏకే 47 తో కాల్పులు జరిపారని దీనికి ఎవరు అనుమతి ఇచ్చారో తేల్చాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోం మంత్రి బాధ్యత వహించాలన్నారు. 

*ఆగస్టు 6నుంచి 14 వరకు పాదయాత్రలు*

దేశవ్యాప్తంగా బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 'బద్లావ్ జరూరీ హై.. మార్పు కావాలి'నినాదంతో ఆగస్టు 6 నుంచి 14 వరకు గ్రామాలు మండలాలు జిల్లాల్లో పాదయాత్రలకు కేంద్ర కమిటీ పిలుపునిచ్చిందన్నారు. ధరల పెరుగుదల అరికట్టాలని ప్రతి యువకుడికి ఉద్యోగం కల్పించాలని సార్వత్రిక విద్యా వైద్యం అందుబాటులోకి తేవాలని పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని మహిళలకు రిజర్వేషన్ తక్షణమే అమలు చేయాలని కార్మిక హక్కులను పరిరక్షించాలని బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలు జరపాలని దళిత ఆదివాసీలపై అకృత్యాలను దాడులను నిలిపివేయాలని పోరాటంలో ప్రధాన డిమాండ్లు అన్నారు. దీనికి ముగింపుగా సెప్టెంబర్ 1న న్యూఢిల్లీ రామ్ లీలా మైదానంలో 'బద్లావ్ జెరూరీ హై (మార్పు అత్యవసరం)'భారీ బహిరంగ సభ తో ముగుస్తుందని కార్యక్రమాల విజయవంతానికి సిద్ధం కావాలన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళావతమ్మ, రాబర్ట్, శ్రీరామ్, రమేష్, నరసింహ శెట్టి, శ్రీహరి, గోపాలకృష్ణ, కృష్ణవేణి, జె. చంద్రయ్య కుర్మయ్య, కుతుబ్, బాలరాజు, మాషప్ప, తదితరులు పాల్గొన్నారు

💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి