Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

పెండింగ్ లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్ని వేగవంతం చేయాలి

 పెండింగ్ లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్ని వేగవంతం చేయాలి


  •  గుడిసెల్లో నివసించే వారికే ప్రథమ ప్రాధాన్యతగా కొత్త ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి


 వనపర్తి ,జులై (రైజింగ్ సన్ ప్రతినిధి):
  ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులో పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కొత్తకోట ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో కొత్తకోట, మదనాపూర్ మండలాల అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్లు మంజూరై నిర్మాణం ప్రారంభం కాని ఇళ్లను వెంటనే గ్రౌండింగ్ చేయించి పనులు ప్రారంభించేలా క్షేత్రస్థాయిలో ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. లబ్ధిదారులు ప్రైవేట్ అప్పులపై ఆధారపడకుండా స్వయం సహాయక సంఘాల (SHGs) ద్వారా రుణాలు పొందేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.  మండలంలో ఇండ్లు మంజూరై ఇంకా ప్రారంభం కాని 58 ఇళ్లను, మదనాపూర్ మండలంలో ప్రారంభం కాని 28 ఇళ్లను తక్షణమే ప్రారంభించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని పేర్కొన్నారు. లబ్ధిదారులకు రుణాలు ఇప్పించి అయినా వెంటనే నిర్మాణాలు ప్రారంభించే విధంగా చొరవ తీసుకోవాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించి, రోజువారీ పురోగతిని పర్యవేక్షిస్తూ లక్ష్యాలను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కొత్తగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు సంబంధించి అర్హులను వేగంగా గుర్తించి తమ లాగిన్ కు పంపాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. గుడిసెల్లో నివసించే వారే ప్రథమ ప్రాధాన్యతగా ఇండ్ల మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  


 దొడ్డు రకం వరి వేయకుండా చర్యలు తీసుకోవాలి 

                                                                     గ్రామాల్లో రైతులు దొడ్డు రకం వరి పంట వేయకుండా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. సన్న రకం వరి ధాన్యం మాత్రమే పండించేలా వారికి అవగాహన కల్పించాలని, పంట మార్పిడి పైన కూడా అవగాహన కల్పించాలని సూచించారు. సన్న రకం వరి ధాన్యం వేయడం ద్వారా రైతులకు బోనస్ కూడా వస్తుందని విషయాన్ని వారికి తెలియజేయాలని సూచించారు. అదేవిధంగా ధాన్ రకం వరి ధాన్యం వేయకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. దానివల్ల రైతులకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలియజేశారు. విత్తన సరఫరా డీలర్లతో సమావేశం నిర్వహించి అటువంటి రకాలను అమ్మ వద్దని ఆదేశాలు జారీ చేయాలని తెలిపారు. అదేవిధంగా నానో యూరియా పైన కూడా రైతుల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.  అంతకుముందు కార్యాలయ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇంటిని సందర్శించి లబ్ధిదారుల నుంచి నిర్మాణ వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్, హౌసింగ్ పీడీ విఠోబా, జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, మునిసిపల్ వైస్ చైర్పర్సన్ సునీత పల్లవి, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి