శ్రీ రంగనాయక స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిన్
వనపర్తి ,జులై (రైజింగ్ సన్ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముద్దీన్ గురువారం తన కుటుంబ సభ్యులతో కలిసి వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాయక స్వామి దేవాలయం లోని ప్రసిద్ధ శ్రీదేవి భూదేవి సమేత స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఈ సందర్భంగా ఆలయ అధికారులు సిబ్బంది మంగళ వాయిద్యాలు నడుమ సాంప్రదాయబద్ధంగా ఆలయంలోనికి ఆహ్వానించారు.
అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో ప్రత్యేక ఆశీర్వాదం అందజేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. తదనంతరం ఆలయ పరిసరాలను దర్శించి అక్కడి సహజ సౌందర్యాన్ని వీక్షించారు. ఆలయంలోని మ్యూజియంలో సందర్శించి అక్కడ ప్రదర్శించిన చారిత్రక చిత్రాల్లో కలఖండలను ఆసక్తిగా పరిశీలించి ప్రశంసించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ ఆదర్శ సురబి , అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ మొక్కలు నంది చేసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు తన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం స్థానిక సర్పంచ్ మద్దిలేటి మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments