Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

*కార్మిక సంఘాలను నిర్మూలించే కుట్ర: నరసింహ*

దేశంలో కార్మిక సంఘాలను నిర్మూలించేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ ఆరోపించారు. బుధవారం వనపర్తి ఆఫీసులో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి అధ్యక్షతన జరిగిన ఏఐటియుసి జిల్లా విస్తృత కౌన్సిల్ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన నరసింహ మాట్లాడుతూ.. దశాబ్దాల తరబడి కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడులుగా చేసి నిర్వీర్యం చేసిందన్నారు. గతంలో ఏడుగురు


 సభ్యులతో కార్మిక సంఘం ఏర్పాటు చేసుకునే వీలుండేదని, ఇప్పుడు 100 సభ్యులు ఉండాలని నిబంధన పెట్టారన్నారు. ఎన్నికల్లో 51 శాతం ఓట్లు వస్తేనే గుర్తింపు సంఘంగా పరిగణిస్తామనటం విచిత్రంగా ఉందన్నారు. పని గంటలు పెంచారన్నారు. కార్మికుల శ్రమను దోచి సంపన్నులకు పెట్టటమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కార్మికులను సంఘటితం చేసి వ్యతిరేకంగా పోరాడాలి అన్నారు. ఏఐటీయూసీ వనపర్తి జిల్లా నాలుగవ మహాసభలు పెబ్బేరులో జూలై 30 ,31 తేదీల్లో జరపాలని, ఈనెల 23న సన్నాక సమావేశం నిర్వహించాలన్నారు. ఏఐటీయూసీకి వనపర్తి జిల్లాలో బలమైన నాయకత్వం ఉందని చొరవ తీసుకొని గ్రామాల్లోకి వెళ్లి సంఘాలను నిర్మించి వారి హక్కుల కోసం పోరాడాలి అన్నారు. 30, 31వ తేదీన జరిగే సభలకు పెద్ద ఎత్తున కార్మికులను సమీకరించి విజయవంతం చేయాలన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు కరీంనగర్లో సెప్టెంబర్ 6 7 8 తేదీల్లో జరుగుతాయని పెద్ద ఎత్తున తరలివచ్చేందుకు సిద్ధం కావాలన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు జిల్లాలో కార్మిక సంఘాల ఏర్పాటు బలోపేతానికి పార్టీ పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, ప్రధాన కార్యదర్శి మోష, ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ కౌన్సిల్ సభ్యులు భాస్కర్ శ్యామ్ రఘు సుందర్ ఖయ్యూం బాలకృష్ణ కురుమయ్య తదితరులు పాల్గొన్నారు.

💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి