Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు...మహిళా పోలీసులతో కలిసి ఆడిపాడిన ఎస్పీ సునీతారెడ్డి

 వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు...

- మహిళా పోలీసులతో కలిసి ఆడిపాడిన ఎస్పీ సునీతారెడ్డి

వనపర్తి, అక్టోబర్ 16 (రైజింగ్ సన్): వనపర్తి జిల్లా పోలీస్ కేంద్ర కార్యాలయంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ డి. సునీతారెడ్డి ఐపీఎస్ మహిళా పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొని ఆడిపాడారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి, గునుగు, తంగేడు తదితర పుష్పాలతో పేర్చారు. గౌరమ్మను ప్రతిష్ఠించి, సంప్రదాయ పాటలు పాడుతూ కోలాటాలతో సందడి చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ సునీతారెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ, బోనాలు, సమ్మక్క-సారలమ్మ జాతరలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతకు, ప్రకృతిపై ప్రేమకు ప్రతిబింబమని అన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి పండుగలను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.పోలీసు సిబ్బంది వృత్తిని ప్రేమిస్తూ, విధుల పట్ల అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలని పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఏఆర్ వీరారెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ, డీఎస్పీ గిరిబాబు, సీఐలు ఓడీ రమేష్, రత్నం, ఆర్‌ఐలు అప్పలనాయుడు, శ్రీనివాసకుమార్, ఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, మహిళా పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

 వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు...మహిళా పోలీసులతో కలిసి ఆడిపాడిన ఎస్పీ సునీతారెడ్డి