అనసూయ వ్యాఖ్యలపై వనపర్తిలో మహిళా మోర్చా నిరసన.. ఫ్లెక్సీల దహనం
వనపర్తి, ఆగస్టు 15( రైజింగ్ సన్ న్యూస్):జై శ్రీరామ్ నినాదాలపై సినీ నటి అనసూయ భరద్వాజ్ చేసినట్లు ప్రచారంలో ఉన్న వ్యాఖ్యలపై వనపర్తి జిల్లా మహిళా మోర్చా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మత విశ్వాసాలు, భక్తుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడటం సమర్థనీయం కాదని మండిపడింది.ఈ నేపథ్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని ఓ షాప్ వద్ద ఏర్పాటు చేసిన అనసూయ చిత్రాలతో కూడిన ఫ్లెక్సీలను మహిళా మోర్చా నాయకులు తొలగించి, దహనం చేసి నిరసన తెలిపారు. ప్రముఖులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కవిత, ప్రధాన కార్యదర్శి కల్పన, నాయకులు దుప్పల్లి నిర్మల నారాయణ, సుమిత్రమ్మ, అలివేల, సరోజ, సుగురు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
0 Comments