Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

వనపర్తిలో టైక్వాండో బెల్ట్ గ్రేడింగ్

 వనపర్తిలో  టైక్వాండో బెల్ట్ గ్రేడింగ్

- టైక్వాండోతో ఆత్మవిశ్వాసం – క్రమశిక్షణ పెంపు

- ఆడపిల్లలకు స్వీయరక్షణపై దృష్టి

- విజేతలకు సర్టిఫికెట్ల ప్రదానం

వనపర్తి, ఆగస్టు 14( రైజింగ్ సన్ న్యూస్):  వనపర్తి జిల్లా కేంద్రంలోని సాయి నగర్ కాలనీలో మాస్టర్ మైండ్ హై స్కూల్‌లో ఆదివారం టైక్వాండో మార్షల్ ఆర్ట్స్ బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలను మాస్టర్ రవి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పరీక్షల్లో పాల్గొన్న విద్యార్థులు, విద్యార్థినీలు ప్రతిభ కనబరిచి ఉత్తీర్ణులయ్యారు. కార్యక్రమం అనంతరం విజేతలకు బెల్ట్ గ్రేడింగ్ సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ టైక్వాండో వంటి మార్షల్ ఆర్ట్స్ శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు మానసిక ధైర్యాన్ని పెంచుతాయని తెలిపారు. ప్రస్తుత సమాజంలో ముఖ్యంగా ఆడపిల్లలకు స్వీయరక్షణ (సెల్ఫ్ డిఫెన్స్) అత్యంత అవసరమని పేర్కొన్నారు. పాఠశాల కరెస్పాండెంట్ గౌతమ్ కుమార్ మాట్లాడుతూ, చదువుతో పాటు శారీరక వ్యాయామం, మెదడు చురుకుదనం కూడా విద్యార్థుల సమగ్రాభివృద్ధికి అవసరమని తెలిపారు. ఆరోగ్యవంతమైన విద్యార్థులే భవిష్యత్తులో అన్ని రంగాల్లో రాణించగలరని చెప్పారు. బాలికలకు స్వీయరక్షణలో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పాఠశాల స్థాయిలోనే ఇలాంటి శిక్షణ అందించడం అభినందనీయమని తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కోచ్ బుద్ధారం రవికుమార్, జూనియర్ కోచ్ శివలీల, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు

💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి