Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి భారతీయుడి భాగస్వామ్యం కీలకం: బీజేపీ జిల్లా ఇంచార్జ్ బొక్క బాల్ రెడ్డి, అధ్యక్షులు డి. నారాయణ

 వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి భారతీయుడి భాగస్వామ్యం కీలకం:   

  -  బీజేపీ జిల్లా ఇంచార్జ్ బొక్క బాల్ రెడ్డి, అధ్యక్షులు డి. నారాయణ

రైజింగ్ సన్ న్యూస్ ,నెట్ వర్క్ :ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వాధినేతగా 25 సంవత్సరాల నిరంతర ప్రజాసేవను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా, బీజేపీ జిల్లా అధ్యక్షులు డి. నారాయణ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో “వికసిత్ భారత్ సంకల్ప సభ” ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ ఇంచార్జ్ బొక్క బాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎల్ఈడీ టీవీ ద్వారా ప్రధాని మోదీ గారి 90 నిమిషాల ప్రసంగాన్ని ప్రజలకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వినిపించారు. అనంతరం పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి సామాజిక సేవకులు, చేయూత ఆశ్రమ వ్యవస్థాపకులు విట్టా శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా "సేవా జ్యోతి కలశ యాత్ర"ను ప్రారంభించి, యాత్ర ముగింపు వరకు కొనసాగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వక్తలు మోదీ పాలనలో దేశం సాధించిన ప్రగతిని వివరించారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన ప్రజాసేవ నేటికీ ఒక్కరోజు విరామం లేకుండా 25 ఏళ్లు పూర్తి చేసుకుందని తెలిపారు. 2014కు ముందు వెనుకబడి ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ నేడు ప్రపంచంలోనే 4వ స్థానానికి దూసుకెళ్లిందని కొనియాడారు.

  • పేదలకు ఆర్థిక భరోసా: కాంగ్రెస్ పాలనలో బ్యాంకు మెట్లెక్కని 60 కోట్ల మంది ప్రజలకు జీరో బ్యాలెన్స్ అకౌంట్లు ఇప్పించిన ధీశాలి నరేంద్ర మోదీ అని తెలిపారు. ఉజ్వల యోజన: మాతృమూర్తులకు కట్టెల పొయ్యి పొగ నుంచి విముక్తి కల్పిస్తూ 12 కోట్ల ఉచిత ఉజ్వల సిలిండర్లు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. మహిళా & బాలికా సంక్షేమం: ‘బేటి బచావో బేటి పడావో’, ‘సుకన్య సమృద్ధి యోజన’ ద్వారా 4.53 కోట్ల మంది బాలికల భవితకు భరోసా లభించిందని తెలిపారు. ఉచిత రేషన్ & డిజిటల్ విప్లవం: 2020 నుంచి నేటి వరకు నెలకు 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తున్నామని, ప్రపంచంలో జరిగే ప్రతీ 2వ యూపీఐ పేమెంట్ భారత్ సొంతమని అన్నారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భరత: భారత రక్షణ రంగ పరికరాలు 80 దేశాలకు ఎగుమతి అవుతుండగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో ₹38,424 కోట్లకు చేరుకున్నాయి. రైతు & గృహ సంక్షేమం: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 23 విడతల్లో 11.92 కోట్ల మంది రైతులకు ₹4.47 లక్షల కోట్లు నేరుగా ఖాతాల్లో జమ అయ్యాయని, పీఎం ఆవాస్ యోజన ద్వారా 5 కోట్ల మంది పేదలకు పక్కా ఇళ్లు నిర్మించిచ్చామని వెల్లడించారు. 

2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యం: సభలో జిల్లా బీజేపీ ఇంచార్జ్ బొక్క బాల్రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని స్మరించుకుంటూ, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని (వికసిత్ భారత్) నిర్మించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నారన్నారు. ఈ ప్రయాణాన్ని ఆయన వ్యక్తిగత విజయంగా కాకుండా దేశ ప్రజలు అందించిన ఆశీర్వాదంగా భావిస్తున్నారని పేర్కొన్నారు.

జిల్లా అధ్యక్షులు డి. నారాయణ మాట్లాడుతూ.. 2047 నాటికి భారత్‌ను ప్రపంచ అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థగా, స్వయం సమృద్ధి సాధించిన ప్రపంచ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. ఈ లక్ష్య సాధనకు 140 కోట్ల మంది భారతీయుల సమిష్టి భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. దేశాభివృద్ధి కులం, ప్రాంతానికి అతీతమని, ప్రతి పౌరుడికి దీనితో సంబంధం ఉందని ఆయన ఉద్ఘాటించారు.  ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు అయ్యగారి ప్రభాకర్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు సబిరెడ్డి వెంకట్ రెడ్డి, మున్నూరు రవీందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పురుషోత్తం రెడ్డి, బి. శ్రీశైలం, వెంకటేశ్వర రెడ్డి, కేతూరి బుడ్డన్న, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు అనుజ్ఞా రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ గౌడ్, పెద్దిరాజు, వి. కల్పన, కోశాధికారి బి. కుమారస్వామి, సీనియర్ నాయకులు ఏ. సీతారాములు, చిత్తారి ప్రభాకర్, సుమిత్రమ్మ, బోయల రాము, దాసరాజు ప్రవీణ్, ఏ. కుమార్, వాణిజ్య సెల్ ఈసీ మెంబర్ భాషేట్టి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కే. శివారెడ్డి, రాఘవేంద్ర గౌడ్, కార్యదర్శులు సురేందర్ యాదవ్, మనీ వర్ధన్ సాగర్, తిరుపతయ్య, సరోజ, యువమోర్చా నాయకులు కదిరి మధు, పట్టణ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, అధికార ప్రతినిధులు కంచె ఆంజనేయులు, నక్క మహేష్, వివిధ మోర్చాల జిల్లా అధ్యక్షులు అరవింద్, కవిత యాదవ్, గంధం ప్రవీణ్, రవి నాయక్, అరవింద రెడ్డి, కొమ్ము శ్రీనివాస్, మండల అధ్యక్షులు బుచ్చిబాబు గౌడ్, ముప్పూరు చెన్నయ్య, తిరుపతిరెడ్డి, సంద వెంకటేష్, క్రాంతి నాయుడు, విష్ణువర్ధన్, చిన్న రాయుడు, జిల్లా కౌన్సిల్ సభ్యులు, మండల కార్యవర్గాలు, శక్తి కేంద్రాల ఇంచార్జులు తదితరులు పాల్గొన్నారు.

💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి