Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

కె.ఎల్.ఐ పంపులు నడిపించాలి.. లేదంటే 12న రైతులతో ముట్టడి ప్రభుత్వంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తీవ్ర విమర్శలు

 కె.ఎల్.ఐ పంపులు నడిపించాలి.. లేదంటే 12న రైతులతో ముట్టడి

- ప్రభుత్వంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తీవ్ర విమర్శలు

రైజింగ్ సన్ న్యూస్, వనపర్తి/పాలమూరు అక్టోబర్ 7 : ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సాగునీరు, విద్యుత్‌, ఎరువులు, రుణమాఫీ, రైతుభరోసా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. బుధవారం వనపర్తి పట్టణంలోని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో నిర్వహించిన పత్రిక విలేకరుల సమావేశంలో  కె.ఎల్.ఐ. పంపులను నిర్విరామంగా నడిపి, జూరాల నుంచి నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని ఆయన డిమాండ్‌ చేశారు.

నీరు ఉన్నా.. రైతులకు ఎందుకు అందించడం లేదని ప్రభుత్వాన్ని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు.జూరాలలో సుమారు 9 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. కె.ఎల్‌.ఐ. పంపులు సక్రమంగా నడవకపోవడం, జూరాల నుంచి సకాలంలో నీటిని విడుదల చేయకపోవడం వల్ల లక్షల ఎకరాల పంటలకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.కె.ఎల్‌.ఐ.లో అందుబాటులో ఉన్న నీటిని వినియోగించి పంపులను నడిపితే పంటలను కాపాడటంతో పాటు చెరువులు, వాగులు నిండే అవకాశం ఉందన్నారు.విద్యుత్‌ కోతలు, నిర్వహణ లోపాలతో మోటార్లు, బేరింగ్లు, ఇతర పరికరాలు దెబ్బతింటున్నాయని విమర్శించారు.నిపుణుల సూచనలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.పంటలు చివరి దశలో ఉన్నందున ప్రస్తుతం సాగునీరు అత్యవసరమని తెలిపారు.నార్లపూర్‌ పంపులను ఈ నెల 12వ తేదీలోగా ప్రారంభించకపోతే వేలాది మంది రైతులతో కలిసి ముట్టడి చేపడతామని హెచ్చరించారు.సాగునీటి నిర్వహణకు నిపుణులు సూచించిన పలు ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.గత ప్రభుత్వ హయాంలో సాగు విస్తీర్ణం పెరిగిందని, ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు నీరుఅందించలేకపోతున్నారని విమర్శించారు.రైతులు నీరు, విద్యుత్‌, యూరియా, రుణమాఫీ, రైతుభరోసా కోసం ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు.

ఆస్తులపై ఆరోపణలు.. బహిరంగ చర్చకు సవాల్‌

తన ఆస్తులపై కొందరు నాయకులు చేస్తున్న ఆరోపణలను నిరంజన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.తన ఆస్తులన్నీ చట్టబద్ధంగా, కష్టపడి సంపాదించినవేనని స్పష్టం చేశారు.తనపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఉంటే అధికారులు, మీడియా సమక్షంలో బహిరంగంగా నిరూపించాలని సవాల్‌ విసిరారు.పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణారావు తదితరులు కలెక్టర్లు, అధికారులను తీసుకుని బహిరంగ చర్చకు రావాలని కోరారు.తన వ్యవసాయ క్షేత్రంలోనే చర్చ నిర్వహించేందుకు సిద్ధమని, ముందస్తు సమాచారం ఇస్తే ఏర్పాట్లు చేస్తానని అన్నారు.తన భూమిలో అరగుంట ఆక్రమణ కూడా రుజువైతే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెబుతానని సవాల్‌ చేశారు.తనపై ఆధారాలు లేని ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు చేయడం రాజకీయ ప్రత్యర్థుల చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు.గతంలో తనపై వందల ఎకరాల భూముల ఆక్రమణ ఆరోపణలు చేశారని, విచారణల అనంతరం ఆరోపణలకు ఆధారాలు చూపలేకపోయారని పేర్కొన్నారు.ప్రభుత్వ భూమి విషయంలో చేసిన ఆరోపణల్లోనూ వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉందన్నారు.పానగల్‌ వ్యవసాయ క్షేత్రం తన కష్టార్జితమని పేర్కొంటూ, భూములకు సంబంధించిన అన్ని వివరాలను బహిరంగపరచడానికి సిద్ధమని తెలిపారు.అధికారులపై రాజకీయ ఒత్తిడి తెచ్చి తనపై తప్పుడు నివేదికలు ఇప్పిస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

వ్యక్తిగత విమర్శలు సరికావు...

ప్రజా సమస్యలపై తాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే తనపై వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని నిరంజన్‌రెడ్డి ఆరోపించారు.“ఎన్ని దుష్ప్రచారాలు చేసినా నా వెంట్రుక కూడా పీకలేరు” అని వ్యాఖ్యానించారు.రాజకీయ ప్రత్యర్థులు అసూయ, కుయుక్తులకు పాల్పడకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.తనపై చేసిన ఆరోపణలను చట్టపరంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు.చీకటి ఆదేశాలు, రహస్య నివేదికలు కాకుండా పారదర్శకంగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.ప్రజా సమస్యలను ప్రశ్నించే నాయకులపై వ్యక్తిగత దాడులు చేయడం ప్రజాస్వామ్య సంప్రదాయాలకు విరుద్ధమని అన్నారు.ఈ సమావేశంలో గట్టు యాదవ్‌, బి.లక్ష్మయ్య, వాకిటి శ్రీధర్‌, లక్ష్మారెడ్డి, నందిమల్ల అశోక్‌, కృష్ణా నాయక్‌, మాణిక్యం, వనం రాములు, రాళ్ల కృష్ణయ్య, గంధం పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి