Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

ప్రజా సేవలో చెరగని ముద్ర.. ఈ. వెంకటాచారి - హైదరాబాద్ క్రైమ్ ఏసీపీ కిరణ్‌కుమార్

ప్రజా సేవలో చెరగని ముద్ర.. ఈ. వెంకటాచారి

- నిజాయితీ, సమర్థతకు ప్రతీకగా నిలిచిన అధికారి

- పేదల సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవ.. ఎన్నికల నిర్వహణలోనూ        ప్రతిభ

- ప్రశంసించిన హైదరాబాద్ క్రైమ్ ఏసీపీ కిరణ్‌కుమార్

హైదరాబాద్, ఆగష్టు 21( రైజింగ్ సన్ న్యూస్): సాధారణ కుటుంబం నుంచి వచ్చినా కష్టాలను అవకాశాలుగా మలుచుకుని ఉన్నత స్థాయికి ఎదిగిన ప్రతిభావంతుడైన అధికారి ఈ. వెంకటాచారి, అదనపు కలెక్టర్, వికారాబాద్ అని హైదరాబాద్ క్రైమ్ ఏసీపీ కిరణ్‌కుమార్ కొనియాడారు. ప్రజా సేవలో నిజాయితీ, నిబద్ధత, మానవతా దృక్పథంతో పనిచేస్తూ తనదైన ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. చిన్ననాటి నుంచే క్రమశిక్షణతో పెరిగిన వెంకటాచారి.. తండ్రికి వృత్తిపరమైన పనుల్లో సహకరిస్తూనే విద్యపై ప్రత్యేక శ్రద్ధ చూపారని తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించి పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారని పేర్కొన్నారు.

పేద రైతులకు అండగా..

రెవెన్యూ శాఖలో బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వివిధ ప్రాంతాల్లో ఎంఆర్‌ఓ, ఆర్డీవోగా ఆయన అందించిన సేవలు ప్రశంసనీయమని కిరణ్‌కుమార్ అన్నారు. ముఖ్యంగా భూ వివాదాల పరిష్కారంలో న్యాయబద్ధంగా వ్యవహరిస్తూ పేద రైతులకు అండగా నిలిచారని చెప్పారు. ప్రజల సమస్యలను సానుభూతితో విని, వాటి పరిష్కారానికి చొరవ చూపడం ఆయన ప్రత్యేకతగా అభివర్ణించారు.

కాళేశ్వరం భూసేకరణలో కీలక బాధ్యతలు

రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియలో కీలక బాధ్యతలు నిర్వర్తించడం వెంకటాచారి ఉద్యోగ ప్రస్థానంలో ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందన్నారు. క్లిష్టమైన పరిస్థితుల్లోనూ సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించి అధికారిగా తన సామర్థ్యాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు.

ఎన్నికల నిర్వహణలో ప్రతిభకు అవార్డు

2018 శాసనసభ సాధారణ ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన వెంకటాచారి.. ఎన్నికలను ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించారని కిరణ్‌కుమార్ తెలిపారు. ఈ ప్రతిభకు గుర్తింపుగా గౌరవ గవర్నర్ చేతుల మీదుగా ఉత్తమ రిటర్నింగ్ అధికారి అవార్డు అందుకోవడం ఆయన సేవలకు దక్కిన విశిష్ట గౌరవమని పేర్కొన్నారు.

కుటుంబానికీ ఆదర్శం

వృత్తిపరమైన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడంతో పాటు కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఇచ్చిన వ్యక్తిగా వెంకటాచారి నిలిచారని కిరణ్‌కుమార్ తెలిపారు. సతీమణి సుధారాణితో కలిసి ఇద్దరు కుమారులను ఉన్నత విలువలతో తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు.ప్రజా సేవలో అంకితభావం, విధి నిర్వహణలో నిజాయితీ, సమస్యల పరిష్కారంలో మానవతా దృక్పథంతో వెంకటాచారి ఎందరికో ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు హైదరాబాద్ క్రైమ్ ఏసీపీ కిరణ్‌కుమార్ పేర్కొన్నారు.


💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

1 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి