మాట ఇచ్చారు.. విద్యార్థులతో మమేకమయ్యారు
- మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
వనపర్తి, ఆగస్టు 12 ( రైజింగ్ సన్ న్యూస్) : విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించి, విద్య పట్ల ఆసక్తిని పెంచేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో మమేకం కావాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి మండలం అంజనగిరి గ్రామంలోని పాఠశాలను ఇటీవల సందర్శించిన ఆయన.. ‘సర్’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పాఠాలు బోధించి పరిశుభ్రత, మంచినీరు, ఆహార నాణ్యతపై అవగాహన కల్పించారు.ఆ సందర్భంగా విద్యార్థులకు స్వయంగా భోజనం ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీ మేరకు మంగళవారం పాఠశాలకు చేరుకుని విద్యార్థులకు భోజనం వడ్డించారు. అనంతరం వారితో ఆప్యాయంగా మాట్లాడి రైతులు, రైతు కూలీల ప్రాధాన్యాన్ని వివరించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, రైతులను గౌరవించాలని సూచించారు. విద్యార్థులకు చాక్లెట్లు, అరటిపండ్లు అందించారు.విద్యతో పాటు క్రమశిక్షణ, సమాజంపై అవగాహన కల్పించి విద్యార్థులను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులు, అధికారులు కృషి చేయాలని నిరంజన్‌రెడ్డి సూచించారు. కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

0 Comments