Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

రూ.359 కోట్లతో హ్యామ్ రోడ్లకు శంకుస్థాపన

రూ.359 కోట్లతో హ్యామ్ రోడ్లకు శంకుస్థాపన

2028 నాటికి పాలమూరులో అద్దంలాంటి రహదారులు నిర్మిస్తాం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి



వనపర్తి, జూలై 13( రైజింగ్ సన్ న్యూస్):

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి కట్టుబాటుతో పనిచేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి జిల్లాలో రూ.359.09 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 171.96 కిలోమీటర్ల హైబ్రిడ్ అన్యుటీ మోడల్ (హ్యామ్) రహదారి అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు.రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి హ్యామ్ ప్రాజెక్టు పనులను ప్రారంభించిన అనంతరం వనపర్తి రాజీవ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో మంత్రి కోమటిరెడ్డి ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రహదారుల అభివృద్ధికి రూ.3,000 కోట్ల వరకు నిధులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 2028 నాటికి పాలమూరులో అద్దంలాంటి రహదారులను నిర్మిస్తామని, కురుమూర్తి స్వామి దేవాలయానికి అత్యాధునిక రహదారులను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.పాలమూరు ఇక వెనుకబడిన జిల్లా కాదని, రహదారులతో పాటు సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాల కల్పన ద్వారా అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.హ్యామ్ ప్రాజెక్టు కింద ప్రభుత్వం–ప్రైవేట్ భాగస్వామ్యంతో రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఆత్మకూరు రోడ్డు బలోపేతం, మాధారం–మార్చాల రహదారి విస్తరణ, పెద్దదగడ–వెలగొండ (గూడెం, బెక్కెం, మియాపూర్ మీదుగా) రహదారి అభివృద్ధితో పాటు మొత్తం 171.96 కిలోమీటర్ల మేర రహదారి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో కూడుకున్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం సమాంతరంగా కొనసాగిస్తోందన్నారు. వనపర్తి జిల్లాలో రూ.359.09 కోట్లతో రహదారుల అభివృద్ధి చేపట్టడం జిల్లాకు మేలు చేస్తుందన్నారు.వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన కావడం సంతోషకరమన్నారు. వనపర్తికి ఐటీ టవర్, రూ.275 కోట్లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చామని తెలిపారు. జిల్లాలోని ప్రధాన రహదారులను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు మరో రూ.124 కోట్ల నిధులు మంజూరు చేయాలని మంత్రి కోమటిరెడ్డిని కోరారు.దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, హ్యామ్ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో రహదారుల అభివృద్ధికి కొత్త ఊపు వస్తుందని అన్నారు. కురుమూర్తి స్వామి ఆలయానికి వెళ్లే రహదారి పనులను కూడా త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి మాట్లాడుతూ, జిల్లా రహదారి అభివృద్ధికి భారీ నిధులు మంజూరు చేసిన మంత్రి కోమటిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ సునీతారెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్, మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి, వైస్ చైర్మన్ మధు, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి