Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

ఆయిల్‌పామ్ సాగుతో రైతులు మంచి ఆదాయం పొందవచ్చు: వ్యవసాయ శాఖ కార్యదర్శి కే. సురేంద్ర మోహన్

☀️ RISING SUN
తెలుగు దినపత్రిక
DISTRICT

ఆయిల్‌పామ్ సాగుతో రైతులు మంచి ఆదాయం పొందవచ్చు: వ్యవసాయ శాఖ కార్యదర్శి కే. సురేంద్ర మోహన్

రిపోర్టర్: Naresh   |   ప్రాంతం: Wanaparthy
Rising Sun News Photo
ఆయిల్‌పామ్ సాగుతో రైతులు మంచి ఆదాయం పొందవచ్చు: వ్యవసాయ శాఖ కార్యదర్శి కే. సురేంద్ర మోహన్
- ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ఆరుతడి పంటల వైపు రైతులు మొగ్గుచూపాలి : వ్యవసాయ శాఖ కార్యదర్శి కే. సురేంద్ర మోహన్

- ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులు వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో సాగు చేసే ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ, ఉద్యాన శాఖ కార్యదర్శి కే. సురేంద్ర మోహన్ సూచించారు.

బుధవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి పెబ్బేరు మండలం జనంపల్లి గ్రామ శివారులోని రైతుల పొలాలను సందర్శించి పంటల సాగు పరిస్థితులను పరిశీలించారు. అనంతరం జనంపల్లి గ్రామ రైతులతో ముఖాముఖిగా మాట్లాడి పంటల సాగు, నీటి లభ్యత, ఎరువుల సరఫరా తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతు బాలరాజు మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని తాను కందుల పంటను సాగు చేసినట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించడంతో కందుల సాగు చేపట్టినట్లు చెప్పారు. గతంతో పోలిస్తే ఈ ఏడాది గ్రామంలో వరి సాగు విస్తీర్ణం తగ్గిందని, పలువురు రైతులు ఆరుతడి పంటల సాగు వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. మరో రైతు వెంకటస్వామి తాను చేపట్టిన ఆయిల్‌పామ్ సాగు ద్వారా ప్రస్తుతం మంచి ఆదాయం పొందుతున్నట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శికి వివరించారు.రైతులు యూరియా, ఇతర ఎరువుల సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులను వ్యవసాయ శాఖ కార్యదర్శి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన సురేంద్ర మోహన్ సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా సరఫరాపై నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.అనంతరం వ్యవసాయ శాఖ కార్యదర్శి కే. సురేంద్ర మోహన్ మాట్లాడుతూ, ప్రస్తుత నీటి లభ్యత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. ఆయిల్‌పామ్ సాగు ద్వారా రైతులు మంచి ఆదాయం పొందే అవకాశం ఉందని, అర్హత ఉన్న రైతులు ఆయిల్‌పామ్ సాగు వైపు దృష్టి సారించాలని తెలిపారు.ఆయిల్‌పామ్ సాగుతో మంచి లాభాలు పొందుతూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న రైతు వెంకటస్వామిని అభినందించారు. ఆయనను రైతునేస్తం కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి తన అనుభవాలను ఇతర రైతులతో పంచుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
అదేవిధంగా ఆయిల్‌పామ్ తోటల్లో వివిధ సంవత్సరాల్లో ఏయే అంతర పంటలను సాగు చేస్తే రైతులకు అధిక ఆదాయం వస్తుందనే అంశంపై అధికారులు అధ్యయనం చేసి, రైతులకు శాస్త్రీయంగా సూచనలు అందించాలని అన్నారు. ఆయిల్‌పామ్ రైతులను అంతర పంటల సాగు వైపు ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు.
రైతులకు నీటి లభ్యత, పంటల ఎంపిక, అంతర పంటల సాగు, ఎరువుల వినియోగంపై శాస్త్రీయ అవగాహన కల్పిస్తూ, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయ విధానాలను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. అదేవిధంగా స్థానిక ఆయిల్ పామ్ రైతులను ఇతర ప్రాంతాల్లో రైతులు అవలంబిస్తున్న విధానాలపై క్షేత్రస్థాయికి తీసుకువెళ్లి అవగాహన కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజనేయులు, ఉద్యాన శాఖ అధికారి విజయభాస్కర్, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
☀️ Rising Sun Telugu Daily
నిజం కోసం... ప్రజల కోసం... ☀️ Rising Sun
💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి