Header Ads Widget

స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
స్థానిక ప్రకటన
Rising Sun Local Advertisement
⚡ బ్రేకింగ్ న్యూస్
Rising Sun తెలుగు దినపత్రికకు స్వాగతం • తాజా వార్తలు • బ్రేకింగ్ న్యూస్

సమన్వయం, బాధ్యత, సమర్థతతో ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందించాలి...

 సమన్వయం,  బాధ్యత, సమర్థతతో ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందించాలి...


  ➤  క్రమశిక్షణ, సమన్వయం, బాధ్యతాయుత సేవలతోనే ఉత్తమ ఫలితాలు

 ➤ ప్రతి విభాగం విధులు, బాధ్యతలపై స్పష్టత కల్పించిన ఎస్పీ

 ➤  డీజీపీ దృశ్య సమీక్ష సమావేశంలో చర్చించిన అంశాలపై జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా ఎస్పీ



వనపర్తి జులై -04:
డీజీపీ గారి ఆదేశాల సమర్థ అమలే ప్రతి పోలీసు అధికారి ప్రధాన లక్ష్యంగా ఉండాలి విధి నిర్వహణలో బాధ్యత, క్రమశిక్షణ, సమన్వయంతో ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందించాలి" అని జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి, ఐపీఎస్., గారు అన్నారు . శనివారం జిల్లా పోలీసు కార్యాలయం సమావేశ భవనంలో జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి, ఐపీఎస్.,   జిల్లా పోలీసు కార్యాలయంలోని స్పెషల్ బ్రాంచ్, ఐటీ కోర్, డీసీఆర్బీ, కంట్రోల్ రూమ్, సైబర్ క్రైం, నార్కోటిక్, ఏఆర్, జిల్లా పోలీసు కార్యాలయం తదితర విభాగాల అధికారులు, సిబ్బందితో సమన్వయ సమావేశం నిర్వహించారు. శుక్రవారం రాష్ట్ర డీజీపీ గారి ఆధ్వర్యంలో జరిగిన దృశ్య సమీక్ష సమావేశంలో చర్చించిన అంశాలను జిల్లా స్థాయిలో వివరించి, ప్రతి విభాగం తన విధులు, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేలా అవసరమైన మార్గదర్శకాలను అందించారు.ఈ సందర్బంగా ఎస్పీ గారు మాట్లాడుతూ..పోలీసుశాఖలో ప్రతి విభాగం ఒకదానికొకటి అనుసంధానంగా పనిచేసినప్పుడే ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన సేవలు అందించగలుగుతాం. ప్రతి అధికారి, ప్రతి పోలీసు సిబ్బంది తమ బాధ్యతలను పూర్తిగా అవగాహన చేసుకొని, డీజీపీ గారి ఆదేశాలు, రాష్ట్ర పోలీసు శాఖ లక్ష్యాలకు అనుగుణంగా క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావంతో విధులు నిర్వర్తించాలి. సమాచార సమన్వయం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సమయపాలన, బాధ్యతాయుత పనితీరే పోలీసు శాఖ ప్రతిష్ఠను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ప్రతి పోలీసు అధికారికి అత్యున్నత బాధ్యత. ప్రతి విభాగం పరస్పర సహకారంతో పనిచేస్తూ సమర్థవంతమైన పోలీసింగ్‌కు ఆదర్శంగా నిలవాలని ఈ సమావేశంలో స్పెషల్ బ్రాంచ్, ఐటీ కోర్, డీసీఆర్బీ, కంట్రోల్ రూమ్, సైబర్ క్రైం, నార్కోటిక్, ఏఆర్ మరియు జిల్లా పోలీసు కార్యాలయంలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సమావేశంలో విభాగాల వారీగా విధులు, బాధ్యతలు, సమన్వయం, సమాచార మార్పిడి, సాంకేతిక వ్యవస్థల వినియోగం, పెండింగ్ పనుల పురోగతి తదితర అంశాలపై ఎస్పీ సమగ్రంగా సమీక్షించి అవసరమైన సూచనలు చేశారు. కార్యక్రమంలో ఏ ఆర్ అదనపు ఎస్పీ, వీరారెడ్డి, జిల్లా పోలీస్ కార్యాలయం ఏ ఓ, సునంద, రిజర్వ్ ఇన్స్పెక్టర్, శ్రీనివాస్, డిసిఆర్బి ఎస్సై, తిరుపతిరెడ్డి, జిల్లాలోని పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

💬 Comment 📱 WhatsApp 🔔 Subscribe

0 Comments

Featured post

డిమాండ్లకు బీజేపీ మద్దతు  సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్‌ కల్పించాలి: కొప్పుల రాజశేఖర్‌రెడ్డి